
Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్థ్ ఏడడుగులు వేశా డు. సిద్ధార్థ్, అదితిల వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగపురం ఆలయంలో జరిగింది. ఇరు కుటుం బాలు అత్యంత సన్నిహి తుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపిం చారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆల యంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఎవరు ఊహించని విధంగా సిద్ధార్థ్ సీక్రెట్ గా తన వివాహం తంతును ముగించి వేశాడు. మొత్తం మీద తమ అభిమాన నటుడు వివాహం చేసుకోవడంతో ఫాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.