36.2 C
India
Friday, May 3, 2024
More

    NTR : దానవీర శూరకర్ణలో కృష్ణుడి పాత్రను ఏఎన్నార్ ఎందుకు చేయనన్నారో తెలుసా?

    Date:

    NTR
    NTR

    NTRఎన్టీఆర్ ఏది తీసినా సంచలనమే. అప్పుడు ఆయన ప్రత్యేకత అలా ఉండేది. ఆయనకున్న విలువ అలా పెరిగింది. ఎన్టీఆర్ 1977లో దానవీరశూర కర్ణ సినిమా తీశారు. దానికి ప్రేక్షకులు జేజేలు పలికారు. దానికి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా తీశారు. కానీ అది ఆడలేదు. ఇది హిట్టయింది. దీంతో ఎన్టీఆర్ జైత్రయాత్ర కొనసాగింది. అప్పట్లో అల్లూరి సీతారామరాజు కూడా ఎన్డీఆర్ తీయాలని అనుకున్నా కృష్ణ తీయడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి కొన్నాళ్లు వారి మధ్య మాటలు లేకుండా పోయాయట.

    దానవీర శూరకర్ణలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడి పాత్రలు చేశాడు. కృష్ణుడి పాత్రను అక్కినేని నాగేశ్వర్ రావు ను చేయమని ఎన్టీఆర్ అడిగారట. కానీ దానికి ఆయన నో చెప్పారట. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ అయితేనే కరెక్టు. వేరే వారు వేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అందుకే ఆ పాత్ర తాను చేయలేనని సూటిగా చెప్పారట. ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్ పొట్టిగా ఉండటంతో ఆ పాత్రకు తాను తగనని తప్పుకున్నారట.

    ఎన్టీఆర్ మూడు పాత్రలు చేసి మెప్పించారు. దానవీర శూరకర్ణ బ్రహ్మాండమైన హిట్టయింది. కురుక్షేత్రం ఫట్టయింది. ఇలా ఒకే కథతో ఒకేసారి సినిమా తీస్తే ప్రేక్షకులు సరిగా తీసుకోరు. అందుకే కురక్షేత్రాన్ని తుస్సుమనిపించి దానవీరశూర కర్ణను మాత్రం హైలెట్ చేశారు. ఆ రోజుల్లో రూ. 10 లక్షలతో సినిమా తీస్తే రూ. కోటి వచ్చాయట. అంటే ఎంత హిట్టయిందో అర్థమవుతుంది.

    తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిన నటుడు ఎన్టీఆర్. ఆయన నటించిన ప్రతి సినిమా ఆయనలోని నటన కౌశలాన్ని బయట పెట్టింది. దానవీరశూర కర్ణలోని ఏమంటివి ఏమంటివి అనే మాటలు ఇప్పటికి కూడా తెలుగు వారి చెవుల్లో మారుమోగుతుంటాయి. ఎన్టీఆర్ చెప్పిన ఆ సంభాషణలు ఇప్పటికి కూడా ఇంపుగానే ఉంటాయి. అలా దానవీరశూర కర్ణ తెలుగు వారికి ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం కావడం విశేషం.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...