28.5 C
India
Sunday, May 19, 2024
More

    Petrol No Stock : పెట్రోల్ కోసం బారులు తీరిన జనం.. దర్శనం ఇస్తున్న నో స్టాక్  బోర్డ్ లు..

    Date:

    Petrol No Stock
    Petrol No Stock in Hyderabad

    Petrol No Stock : హిట్ అండ్ రన్ కేసులు రూ ఏడు లక్షల జరిమానా పదేళ్లు జైలు శిక్ష ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రక్కు, టాక్సీ, బస్సు డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకులో పెట్రోల్ డీజిల్ నిండుకున్నాయి. ఈ మూడు రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకు ల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సమ్మె నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ లకు క్యూ కడుతున్నారు.

    హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున వాహన దారులు పెట్రోల్ కొట్టించుకోవ డానికి పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొంత మంది క్యాన్ లను తీసుకొని పెట్రోల్ కొట్టించు కోవడానికి బారులు తీరిన పరిస్థితి నెలకొంది. కొన్ని పెట్రోల్ బంకు ల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డ్ లు పెట్టడం తో వాహన దారులు ఆందోళన చెందుతున్నారు.

    పెట్రోల్ కొరతపై కీలక ప్రకటన
    పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలం గాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు.  పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర చట్ట సవర ణతో కొంత గందరగోళం ఏర్పడిందని ఆయిల్ ట్యాంకర్లు యధావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు.
    సమ్మె కారణంగా పెట్రోల్ దొరకదని భావించిన వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం తో వాహనదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో పెట్రోల్ కొట్టించు కోవడానికి బారులు తీరారు. ఆయిల్ ట్యాంకర్ అసోసియే షన్ అధ్యక్షుడు రాజశేఖర్ ప్రకటనతో కాస్త ఊరట కలిగినట్లు అయింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...