తూరుపు కొండల్లో ఉదయించే సూరీడా అంటూ డీజే సాంగ్స్.. సౌండ్స్ తో ప్రతి ప్రభుత్వ శాఖలకు సంబం ధించి మీటింగ్స్ లో తరచూ వినపడుతూనే ఉంటాయి. కానీ విచారించవలసిన విషయం ఏమి టంటే.. అదే తూర్పు ప్రాంతమైన గిరిజనులకు మాత్రం వారి జీవితాలు ఉదయించడం లేదు కానీ అస్తమి స్తున్నా యి. రోడ్లు సరిగా లేక.. డోలీల చేత, మోటార్ సైకిల్ మీద, భుజాల మీద కొన్ని ప్రాంతాలలో అనారోగ్యంతో వున్న వారి ఆప్తులను, మృతదేహాలను మోసుకుని వెళ్లాల్సి వస్తుంది..
విజయనగరం జిల్లా: శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచా యతీ గిరిశిఖర గ్రామం చిట్టంపా డులో పక్షంరోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశ మైంది. ఈ గ్రామానికి చెందిన చిన్నారి జన్ని ప్రవీణ్ అనారోగ్యంతో విజయనగరం ఘోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. వివరా ల్లోకి వెళితే చిట్టింపాడుకు చెందిన ఏడాదిన్నర బాబు ప్రవీణ్ దగ్గు, కఫంతో బాధపడుతుండడంతో ఆది వారం తల్లిదండ్రులు సన్యాసిరావు, సన్యాసమ్మ 7 కి.మీ. మోసుకుంటూ కాలిన డకన ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం పరి స్థితి విషమంగా ఉందంటూ విజయనగరం ఘోషా ఆసుపత్రికి వెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు.
అక్కడికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపో యింది. బాబు మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు అడిగినా ఇవ్వకపో వడంతో ప్రైవేటు వాహనంలో బొడ్డవర రైల్వేస్టేషన్కు తీసుకొచ్చారు. డబ్బులు లేకపోవడంతో తెలిసిన వారి వద్ద రూ.3 వేలు తీసుకొని కిరాయి చెల్లించారు. చిన్నారి మరణంతో చిట్టంపాడుతో విషాద ఛాయలు అలముకున్నాయి. కొద్ది రోజులు క్రితమే ఇదే గ్రామానికి చెందిన తల్లి గంగమ్మ, ఆరు నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే శిఖర గ్రామాల్లో మరణాలు సంభవిస్తున్నాయని ఆదివాసీగిరిజన సంఘం నాయ కులు వాపోయారు. ఈ గ్రామానికి వైద్యులు రారని, సిబ్బంది అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారని ఆరోపిస్తున్నారు.