
హైదరాబాద్ లోని పబ్ లకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటేలా పబ్ యజమానులు పక్క ప్రణాళిక రూపొందించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా న్యూ ఇయర్ వేడుకలు పెద్దగా జరుపుకోలేదు. దాంతో ఈ ఏడాది సంబరాలు దద్దరిల్లిపోవడం ఖాయమని భావించారు. అయితే తెలంగాణ హైకోర్టు పబ్ యజమానులకు షాక్ ఇచ్చింది.
రాత్రి 10 గంటల వరకే సౌండ్ సిస్టం వాడుకోవాలని , రాత్రి 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్ లో సౌండ్ సిస్టం వాడొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది కోర్టు. ఒకవేళ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ఈ సమయంలో రాత్రి ఒంటి గంట వరకు అనుమతులు ఇవ్వాలని పబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది.
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. స్టార్ హోటళ్లు , పబ్ లు , రెస్టారెంట్ లు ఇలా అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. యువతకు ఆకర్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసాయి. ఇక డ్రగ్స్ పెద్ద ఎత్తున చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయం అలా ఉంటే …… డిసెంబర్ 30 , డిసెంబర్ 31 రాత్రి వరకు తెలంగాణలో దాదాపు 500 కోట్ల మద్యం మందుబాబుల చేత తాగించేలా గట్టి ప్రయత్నాలే చేసింది ప్రభుత్వం.