29.5 C
India
Sunday, May 19, 2024
More

    NTR Coin : అన్న ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం.. రేపే రూ. వంద నాణెం విడుదల..

    Date:

    Another rare honor for NTR. Tomorrow Rs. 100 coins released
    Another rare honour for NTR. Tomorrow Rs. 100 coins released

    NTR Coin :

    నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు పేరిట రూ. 100 నాణెన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట రూ. 100 నాణెన్ని ముద్రించింది. కాగా, ఈ నాణెన్ని ఈనెల 28న రాష్ర్టపతి ముర్ము చేతుల మీదుగా రాష్ర్టపతి భవన్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ర్టపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్నారు.

    అయితే ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో  తయారు చేశారు. చారిత్రక ఘటనల ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రూది రిలీజ్ చేశారు. ఇక తెలుగు చలన చిత్ర రంగంలో మరెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు అన్న ఎన్టీఆర్. రాజకీయ రంగంలోనూ రికార్డులను సృష్టించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిటా 1982లో తెలుగు దేశంపార్టీని పెట్టి చరిత్ర సృష్టించారు. పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, రికార్డు విజయం సాధించారు. ప్రజాస్వామ పునరుద్ధరణ అంటూ ఆక్ష్న చేసిన పోరాటం చరిత్రలో మైలురాయిలా నిలిచింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.

    ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పలువురు ప్రముఖులకు ఈ ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన తండ్రి, గ్రేట్ లీడర్, లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తున్న నాణెనికి సంబంధించిన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, తెలుగు రాష్ర్టాల్లోని పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...