AP CM Jagan :
అయితే ఇక్కడి వరకు బాగానే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగానే హైదరాబాద్లోని ఏపీ ఉద్యోగులంతా విజయవాడకు తరలివచ్చారు. విజయవాడతో పాటు సమీప ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. మరికొందరు ఏకంగా ఇండ్లు కట్టుకున్నారు. తద్వారా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఉద్యోగుల రాకతో సందడి పెరిగింది. ఇక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని అంతా ఆశించారు.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో కి వచ్చాక వైసీపీ మాట మార్చింది. ఇప్పటికే నగరంగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే, వసతులు త్వరగా సమకూరుతాయని అభిప్రాయపడింది. అయితే దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులంటూ తెరపైకి తెచ్చినా మెజార్టీ ప్రజలు అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారు. కొత్తగా నిర్మించుకునే నగరాన్ని రాజధానికి అనువుగా మార్చుకోవచ్చనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు విశాఖకు తరలివెళ్తే, ఈ రెండు జిల్లాల్లో కొంత రద్దీ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక ఈ రెండు జిల్లాలు ఇక వైసీపీకి, సీఎం జగన్ కు దూరమైనట్లేనని భావించవచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ తీరుతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ అంటేనే మండిపడే పరిస్థితి ఉంది. ఇక విశాఖకు రాజధాని తరలిస్తే మరింత కష్టం వైసీపీ కొనితెచ్చుకున్నట్లే అవుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.