
ODI World Cup 2023 Schedule : ప్రపంచ కప్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. వన్డే ప్రపంచకప్ మొత్తం భారత గడ్డపై నిర్వహించనునండం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. భారత్ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడనుంది.
ప్రపంచకప్ షెడ్యూల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌తో అహ్మదాబాద్ మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలని పీసీబీ డిమాండ్ చేస్తున్నది. దీనితో పాటు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు, చెన్నైతో తన మ్యాచ్‌ల వేదికలను కూడా మార్చాలని పట్టుబట్టింది. పీసీబీ సమ్మతి తర్వాత బీసీసీఐ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.అక్టోబర్ 8 న ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు సరిగ్గా 100 రోజుల తరువాత, అక్టోబర్ 5 న క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభమవుతుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో, టీమిండియా తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడనుంది. కాగా, అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ వన్డే ప్రపంచకప్ నిర్వహణకు వీలుగా మ్యాచ్ లను ఖరారు చేస్తూ బీసీసీఐ ఐసీసీకి ప్రతిపాదనలను పంపింది. వీటిని ఐసీసీ ఆమోదించడం ఇక లాంఛనమే.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈసారి మూడు ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ కు ముంబై, చెన్నై ఆతిధ్యమివ్వనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్ లో మొత్తం 10 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిలో 8 దేశాలు ఇప్పటికే నేరుగా అర్హత సాధించగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్ ల ద్వారా నిర్ణయించనున్నారు.
మొత్తం 9 నగరాల్లో ఈసారి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇందులో కోల్ కతా, ముంబై,ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ ఉన్నాయి. 2011లో చివరిసారిగా భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ నెగ్గింది. మరోసారి స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ను భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
భారత్ ఆడే మ్యాచ్లు అక్టోబర్ 8 భారత్-ఆస్ట్రేలియా (చెన్నై)అక్టోబర్ 11 భారత్-ఆప్ఘనిస్తాన్ (ఢిల్లీ)అక్టోబర్ 15 భారత్-పాకిస్తాన్ (అహ్మదాబాద్ )అక్టోబర్ 19 భారత్-బంగ్లాదేశ్ (పూణే)అక్టోబర్ 22 భారత్-న్యూజీలాండ్ (ధర్మశాల)అక్టోబర్ 29 భారత్-ఇంగ్లండ్ (లక్నో)నవంబర్ 2 భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (ముంబై)నవంబర్ 5 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (కోల్ కతా)నవంబర్ 11 భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (బెంగళూరు).
భారతదేశానికి గర్వకారణం : జైషా ట్వీట్
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు మూడోసారి ఆతిథ్యమివ్వడం అపురూపమైన గౌరవం. మేము, మా గొప్ప వైవిధ్యం, ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలను చూపిస్తాం. మరిచిపోలేని క్రికెట్ టోర్నమెంట్ ను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి‘ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ ఆడేందుకు విరాట్ కోహ్లీ ఉత్సాహంభారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల సందర్భంగా ప్రకటన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై వేదికగా ప్రపంచకప్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కింగ్ కోహ్లీ తెలిపాడు.