37.7 C
India
Saturday, April 27, 2024
More

    India Vs England : భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ కు రింకూ, తిలక్ కు కాల్.. జట్టును అనౌన్స్ చేసిన బీసీసీఐ

    Date:

    India Vs England
    India Vs England

    India Vs England : నయా ఫినిషర్ గా గుర్తింపు సంపాదించుకున్న రింకూ సింగ్ కు టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరుగనున్న అనధికార టెస్ట్ కు సంబంధించి బీసీసీఐ ‘ఇండియా-ఏ’ టీమ్ ను ప్రకటించింది. ఈ టెస్ట్ జట్టులో రింకూ సింగ్‌ ఉన్నాడు. రింకూతో పాటు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ ఈ జట్టులో ఉన్నారు.

    అఫ్గనిస్తాన్ సిరీస్‌లో రింకూ, అర్షదీప్, సుందర్ రాణించారు. ఆఖరి టీ-20లో రోహిత్‌ శర్మతో కలిసి రింకూ జట్టును ఆదుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరో వైపు తిలక్ వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరగనున్న అనధికారిక టెస్ట్ లో సత్తాచాటితే ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఈ నెల (జనవరి) 25 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగుతుంది. తొలి రెండు టెస్టుల సంబంధించి మాత్రమే ఇండియా టీమ్ ను ప్రకటించారు. చివరి 3 టెస్టులకు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.  మంచి ఫామ్‌లో ఉన్న రింకూ రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటితే టీ మిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టవచ్చు. రింకూ ఇప్పటి వరకు 15 టీ-20లు, రెండు వన్డేల్లో మెరిసాడు. జూన్‌లో జరగనున్న టీ-20 వరల్డ కప్ నకు అతడి ఎంపిక దాదాపు ఖరారైనట్లే. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ పరోక్షంగా వెల్లడించారు.

    రెండో అనధికార టెస్టుకు ‘భారత్ -ఏ’ జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండే, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కావరప్ప,  ఆకాశ్ దీప్, ఉపేంద్ర యాదవ్, యశ్ దయాల్ ఉన్నారు.

    మూడో అనధికార టెస్టుకు ‘భారత్-ఏ’ జట్టు..
    అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుమార్ కుషాగ్రా, షామ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కావరప్ప, ఆకాశ్ దీప్, ఉపేంద్ర యాదవ్, యశ్ దయాల్ ఉన్నారు.

    తొలి రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Virat Dancing : డీజే టిల్లు పాటకు విరాట్ డ్యాన్స్.. ఫ్యాన్స్ కేరింతలు

    Virat dancing : డీజే టిల్లు తెలుగు సినిమాల్లో ఒక సంచలనం....

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    India Vs England : ఐదో టెస్టుల్లో ఇంగ్లాండ్ పై విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ అగ్రస్థానం పదిలం.

    India Vs England : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన ఐదు టెస్ట్...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...