Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా విజయఢంకా మోగించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విక్టరీతో ఐదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో భారత్ గెలుచుకుంది. 120 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4వ రోజు ఊహించిన విధంగా ఆడలేదు.
యశస్వి జైస్వాల్ (37), రోహిత్ శర్మ (55) బాగానే ఆడారు. అనవసర షాట్కు యత్నించి జైస్వాల్ వికెట్ పారేసుకున్నాడు. దీంతో భారత్ వికెట్లు పారేసుకోవడం మొదలైంది. రజత్ పాటిదార్ (0), సర్ఫరాజ్ ఖాన్ (0) గోల్డెన్ డకౌట్ గా నిలిచారు. రవీంద్ర జడేజా (4) కూడా పెవిలియన్దారి పట్టాడు. శుభమన్ గిల్ (52 నాటౌట్), ధృవ్ జురెల్ (39 నాటౌట్) నిలకడగా ఆడుతూ ఆదుకున్నారు.
సర్ఫరాజ్,జడేజా ఔట్ కావడంతో ఓటమి దిశగా టీమిండియా వెళ్తున్నట్లు కనిపించింది. విజయానికి 72 పరుగులు కావాల్సిన సమయంలో గిల్, జురెల్ క్రీజులో పాతుకుపోయారు. బౌండరీలు రాకపోయినా సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొట్ పెంచుకుంటూ వెళ్లారు. టీమ్ను మెల్లమెల్లగా విజయం దిశకు తీసుకెళ్లారు. వారిద్దరే నిలబడి మరీ మ్యాచ్ఫినిష్ చేశారు. ఓటమి అంచు వరకు వెళ్లిన టీమ్ను ఈ ప్లేయర్లు గట్టెక్కించారు. తమ మీద మేనేజ్‌మెంట్, అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఆట తీరు చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
INDIA WINS THE TEST SERIES AGAINST ENGLAND…!!! 🇮🇳 pic.twitter.com/viTIoZYVIP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024