
Chaitanya – Samantha breakup clarity : తెలుగు ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత జంట అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కలిసి ఉన్న నాలుగేళ్లు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించారు. మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.. కారణాలు తెలియక పోయిన ఇప్పటికి కూడా ఈ జంట కలిస్తే బాగుండు అని అనుకోని వారు లేరు..
వీరు విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్న ఇప్పటికి ఏదొక వార్త వస్తూనే ఉంటుంది. కొంతమంది సామ్ ను సపోర్ట్ చేస్తే మరి కొంతమంది చైతూను సపోర్ట్ చేసారు. ఇక తాజాగా నాగ చైతన్య సమంత మీద స్పదించడం హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది.. దీంతో ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సామ్ గురించి కూడా చెబుతున్నారు..
సమంత, చైతూ విడిపోయినప్పటికి వీరి వార్తలు వైరల్ అవుతూనే ఉంటున్నాయి.. తాజాగా చైతూ సమంత గురించి మాట్లాడుతూ.. సామ్ ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదు అని ఈమె నటించిన ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్ 2 అంటే చాలా ఇష్టం అని రీసెంట్ గా యశోద సినిమా కూడా చూశానని తెలిపాడు..
అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సమయంలో ఫ్యామిలీ మ్యాన్ లో సామ్ నటించడం వల్లనే వీరి విడాకులు అయ్యాయని వార్తలు వచ్చాయి.. మరి తాజాగా చైతూ చేసిన కామెంట్స్ తో ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా వీరి విడాకులకు కారణం కాదని తెలిసిపోయింది.. మరి ఎందుకు విడిపోయారు అనేది వీరికి మాత్రమే తెలుసు.