38 C
India
Wednesday, May 15, 2024
More

    CM YS Jagan : అమిత్ షాతో నేడు జగన్ కీలక భేటీ.. చంద్రబాబు అంశంపైనా చర్చ

    Date:

    CM YS Jagan :
    ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇక పలువురు కేంద్రమంత్రులను కలిశారు. శుక్రవారం నిర్వహించనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల సదస్సులో శుక్రవారం పాల్గొననున్నారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలతో పాటు చంద్రబాబు అరెస్ట్ , తరువాతి పరిణామాలపై కూడా చర్చించనున్నారు. చంద్రబాబుపై కేసుల వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగిరం చేయాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తు్న్నది. అయితే ఇప్పుడు ఈ భేటీ కీలకంగా మారబోతున్నది.

    మరోవైపు ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్రం వ్యయాన్ని రూ. 10500 కోట్లకు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్థిక శాఖ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే, వెంటనే కేంద్ర మంత్రి వర్గం ఆమోదించే అవకాశం ఉంటుంది.  ఇక కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి కూడా వెళ్లి ఏపీ సీఎం జగన్ కలిశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో ఏపీకి రూ. 7359 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్పందిస్తూ ఆర్డీఎస్ఎస్ పథకానికి ఏపీ అర్హత సాధించిందని, దాని కింద అందించే ఆర్థిక సహాయం గురించి చర్చించామని చెప్పారు.

    ఇక ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రితో కూడా జగన్ శుక్రవారం భేటీ కానున్నారు. ఇక రాత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పలు రాజకీయ పరమైన నిర్ణయాలపై వీరిద్ధరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడంలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న ఈ భేటీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. బీజేపీ, వైసీపీ కలిసే ఈ కుట్రలో పాలుపంచుకున్నాయని వాదనల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ అడుగులు తర్వాత ఎలా ఉంటాయనే దానిపై ఏపీలో రాజకీయాలు మారబోతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...