India vs Canada :
తాజాగా జీ20 దేశాల సదస్సు సందర్భంగా భారత్ కెనడా విభేదాలు మరింత పెరిగాయి. ఓ ఖలిస్థానీ నేత హత్య పై ఆయన మాట్లాడుతూ దీని వెనుక భారత్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. భారత్ ఏజెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని వారు వ్యాఖ్యానించారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తాము దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం మరింత వివాదానికి ఆజ్యం పోసింది. ఓ పార్టీ మెప్పు కోసమే ట్రూడో ఇలా చేస్తున్నట్లు అంతా అనుమానిస్తున్నారు.
2021 నుంచి ట్రూడో రాజకీయ బలహీనత ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారినట్లు తెలుస్తున్నది. 2021 ఎన్నికల్లో 338 సీట్ల ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ సీట్లు 177 నుంచి 150కి తగ్గాయి. అదే సమయంలో కన్జర్వేటీవ్ పార్టీకి 121 సీట్లు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) కి 24, బ్లాక్ క్యూబెక్స్కు 32, గ్రీన్ పార్టీ కి 3, ఇలా వచ్చాయి. అయితే జగ్మీత్ సింగ్ ధాలివర్ నేతృత్వంలోని ఎన్డీపీ ట్రూడోకు మద్దతునిచ్చింది. అయితే ఈ ఎన్డీపీ నాయకులు ఇప్పటికే పలుమార్లు ఖలీస్థాని వేర్పాటువాదానికి మద్దతు పలికారు. 2013లో జగ్మీత్ కు భారత్ వీసాను తిరస్కరించింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీ ట్రూడో ప్రభుత్వానికి మద్దతునిస్తోంది. అయితే ఈ జగ్మీత్ సింగ్ జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును కూడా వ్యతిరేకించాడు.
అయితే కెనడా విషయంలో భారత్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. జీ 7 సభ్య దేశాల్లో ఒకటైన కెనడా ఖలీస్థాని మద్దతుదారులతో నడుస్తుండడం భారత్ కు మద్దతుదారుగా నిలిచింది. అయితే కొంతకాలంగా ఖలీస్థానీ మద్దతుదారులు భారత ప్రజలు, ఆలయాలు, దౌత్య కార్యాలయాలపై దాడులు కొనసాగిస్తున్నారు. మార్చిలో లండన్ లోని భారత్ హై కమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది. భారత పతాకాన్ని అవమానించారు. ప్రధాని ఇందిరా హత్యకు మద్దతుగా ఖలీస్థానీ వేర్పాటువాదులు ర్యాలీ చేపట్టారు. దీనిని గతంలోనే భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఇక జూలైలో భారత విద్యార్థులపై ఖలీస్థానీ మద్దతుదారులు ఇనుపరాడ్లతో దాడులు చేశారు. ఇకపై భారత దౌత్యవేత్తలకు, సిబ్బందికి హానీ కలిగిస్తామంటూ ఖలిస్థానీలు తరచూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇదే భారత్ కోపానికి కారణమవుతున్నది. ఖలీస్థానీ మద్దతుదారులకు కెనడా ఇప్పుడు చోటు కల్పించడం భారత్ ఆందోళనకు కారణమవుతున్నది.
అయితే గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే వద్ద ఖలిస్థాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గురద్వారాలో కాల్చి చంపారు. నిజ్జర్ పంజాబ్ లోని జలంధర్ సమీపంలోని భార్ సింగ్ పుర గ్రామానికి చెందిన వ్యక్తి . 1997లో కెనడాకు ప్లంబర్ గా వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటు వాదులతో బలమైన సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ వెనుక కీలక వ్యక్తి కూడా ఇతనే. 2020లో నిజ్జర్ ను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. దీంతో ఆయనపై నిఘా పెరిగింది. పలు అంతర్జాతీయ కేసులో నిజ్జర్ పాల్గొన్నట్లు సమాచారం భారత్ వద్ద ఉంది. అయితే ఈ నిజ్జర్ అనుకోకుండా హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తున్నది. ఇదే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.
ReplyForward
|