
Mobile : ప్రస్తుతం అందరు ఫోన్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎవరిని పట్టించుకోవడం లేదు. దేన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో గంటల తరబడి ఫోన్ తోనే ఉంటున్నారు. పండగలొచ్చినా ఏదొచ్చినా ఫోనే ప్రపంచం. ఎవరితో మాట్లాడరు. ఏ పని చేయరు. ఇరవై నాలుగు గంటలు ఫోన్ తోనే కాలం గడుపుతున్నారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు.
భోజనం చేసినా, నిద్ర పోతున్నా ఫోన్ పక్కనే ఉంచుకుంటున్నారు. నిద్రపోయే సమయంలో ఫోన్ మనకు దూరంగా ఉంచుకోవాలని చెబుతున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. పూర్వం రోజుల్లో ఆటలతో కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు అది మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇదో వ్యసనంగా మారుతోంది. దీనికి అడ్డుకట్ట పడటం లేదు.
యువత అయితే ఫోన్ తోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సమయం దొరికితే చాలు ఫోన్ తోనే గేమ్ లు ఆడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని పలు కంటెంట్లు తెలుసుకోవడానికి స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీని వల్ల నష్టాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఫోన్ తోనే కాలక్షేపం చేసేందుకు నిర్ణయించుకుంటున్నారు.
ఫోన్ ఎక్కువ సమయం చూడటం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ చీకట్లో ఫోన్ చూడటం వల్ల కంటి చూపు దెబ్బతిన్నది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. కానీ వాటిని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈనేపథ్యంలో ఫోన్ వాడకం తగ్గించాలి. అధిక సమయం ఫోన్ వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని తెలుసుకుంటే మంచిది.