33.2 C
India
Sunday, May 19, 2024
More

    Politics : బటన్లు నొక్కుడు కాదు.. బడ్జెట్ చూసుకోండి

    Date:

    kcr jagan
    kcr jagan
    Politics : ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత రెండిటి మధ్య పోలికలను చూడడం ప్రజలకు కామన్ గా మారిపోయింది. పరిపాలన, పథకాలు, రాజకీయాల దగ్గర్నుంచి ప్రతి అంశాన్నీ పోల్చి చూస్తున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలుపైనా చర్చ జరుగుతున్నది. ఏ ప్రభుత్వం ఎక్కువగా లబ్ది చేకూర్చుతున్నదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్కడేం పథకాలు ఉన్నాయి. ఏ పథకం ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతున్నదని ఆరా తీస్తున్నారు.
    తెలంగాణ లో సంక్షేమ జోరు
    సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఎన్నో పథకాలను అమలు చేశారు.  ఒక్కో పథకానికి పెద్ద మొత్తలో నిధులు సమకూరుస్తున్నారు. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు కింద రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేస్తున్నారు. ఇప్పడు కొత్తగా గృహలక్ష్మి పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ. మూడు లక్షల చొప్పున ఇచ్చేందుకు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మొన్నటికి మొన్న రైతులకు రుణమాఫీ కూడా చేసేశారు.  ప్రతీ రోజూ వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని నివారించుకుంటున్నారు.
    బటన్ నొక్కినా డబ్బులేవి..?
    మరో వైపు ఏపీ సర్కార్ ప్రకటించిన పథకాలకు సంబంధించిన బటన్లను సీఎం జగన్ సకాలంలో నొక్కడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు.   సకాలనొక్కలేకపోతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. బటన్లు నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు మాత్రం పడడం లేదు.  అన్ని పథకాలదీ అదే తీరు. ప్రయోజనం తక్కువైనా ఫలితం అందడం లేదు.
    ఇటీవల జీరో వడ్డీ పేరిట కోటి మంది డ్వాక్రా మహిళలకు 1200 కోట్లు ఇస్తానంటూ  జగన్ రెడ్డి బటన్ నొక్కారు.  అంటే ఒక్కో మహిళకు వచ్చేది కేవలం రూ.1200 మాత్రమే. అవీ పడలేదు.  అసలు బటన్లు నొక్కడం ఎందుకు, మోసం చేయడం ఎందుకు అక్కడి లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రకటించే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం దగ్గర విషయం అయిపోయిదని ప్రజలు కూడా ఓ అంచనాకు వస్తున్నారు.
    ఇంకా నమ్ముతారా? 
    ఇక జగన్ తన వ్యతిరేకతను పొగొట్టుకునేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు.  జగన్ ప్రజాధనాన్ని సొంతానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటున్నారు. పథకాలకోసం కేంద్రం నుంచి  అప్పులు తేవడం… ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నారు. ఎన్ని చేసినా ఉన్న పథకాలకే డబ్బులు సరిపోవడం లేదు. అందుకే కొత్త పథకాలు ప్రకటించినా జగన్ ను మరింత అప్రతిష్టపాలు కాక తప్పదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...