38.1 C
India
Sunday, May 19, 2024
More

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Date:

    Election Commission
    Election Commission

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. మూడో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. ఇంకా నాలుగు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో ఓటర్లను నమ్మించేందుకు నానారకాల హామీలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్ష నాయకుల లోపాలను ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అత్యధిక ప్రాధాన్యత ఈ రకమైన ప్రచారానికే ఇస్తున్నారు రాజకీయ నాయకులు.

    ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎదుటి వారిని కించపరిచేలా ప్రచారాలకు తెరలేపారు కొందరు రాజకీయ నాయకులు. ఇలాంటి ప్రచారాలపై ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన మూడు గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని పేర్కొంది. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

    పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈవిధంగా స్పందించింది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి కొందరు ప్రముఖ నాయకులు, సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలను వైరల్‌ చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించింది. ఆర్టీఫిషియల్ టూల్స్‌ను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని హితవు పలికింది.

    ఇటీవల కాలంలో అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలు రాష్ట్రాలకు చెందిన వారికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికూడా ఉన్నారు. ఆయనకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...