32.1 C
India
Tuesday, May 14, 2024
More

    Nadhamuri BalaKrishna : పేలిన ‘జై బాలయ్య’ స్లో ‘గన్’.. అమెరికాలో లొల్లి లొల్లి.. కొట్టుకున్న తెలుగోళ్లు..

    Date:

    Nadhamuri BalaKrishna : నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే ఫ్యాన్స్ కు పూనకాలే. ప్రపంచవ్యాప్తంగా ఈ నందమూరి హీరోకు అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల ఫంక్షన్ లైన పార్టీలైన, ఇతర ఏ కార్యక్రమాలైనా జై బాలయ్య అనే స్లోగన్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ అభిమానులు బాలయ్యను దేవునిలా కొలుస్తుంటారు. ఆయన పర్యటనలు ఉన్నాయంటే జై బాలయ్య నినాదంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది.. కానీ దేశం కానీ దేశంలో జై బాలయ్య నినాదం పెద్ద చిక్కుని తెచ్చిపెట్టింది. విదేశీ గడ్డమీద ఉన్నామనే కనీస జ్ఞానం మరిచి జై బాలయ్య నినాదాలు చేస్తూ కొందరు తెలుగు యువకులు తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అంతటా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఒక కార్యక్రమాన్ని చెడగొట్టి హ్యాపీగా వెళ్లిపోయారు.
    అమెరికాలోని ఇల్లినాయస్ లో ఓ ఆర్కెస్ట్రా బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆడియన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం సాఫీగా సాగుతున్నది. ఇంతలోనే వెనుక నుంచి జై బాలయ్య అనే అరుపులు మొదలయ్యాయి. ఇలా అరిచిన యువకులను నిర్వాహకులు బయటకు పంపారు. బయటికి వెళ్లినవారు మరికొందరిని తీసుకొని వచ్చి ప్రోగ్రాంలో రసాభాస చేశారు కార్యక్రమం అంతా మధ్యలోనే రద్దయ్యింది. ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
    అయితే ఇవి ఏపీలోనే జరిగినట్లు సోషల్ మీడియాలో ఓవర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో ఉన్నది వైకాపా నేతలేనని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత అది అమెరికాలో జరిగిన కార్యక్రమం అని, అక్కడే బాలయ్య అభిమానులు గొడవ గొడవ చేశారని తెలుసుకొని నాలుకర్చుకుంది. ఏదేమైనా బాలయ్య అభిమానులా మజాకా.. అంతా పూనకాలు లోడింగ్సే.. సినిమా థియేటర్లలో నే కాదు.. ఇప్పుడు జై బాలయ్య నినాదం ఖండాంతరాలు దాటింది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related