Gaami : విశ్వక్‌సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8) రోజునే విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్, తదితర సమస్యల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దానికి బదులు విశ్వక్ సేన్ నటించిన గామి తెరపైకి వచ్చింది. ఈ సినిమా నటుడికి ఒక ప్రయోగమే తప్ప కమర్షియల్ సినిమా కాదు. కానీ, ఓపెనింగ్స్ సాలిడ్ గా కనిపిస్తూ వీకెండ్ విన్నర్ అని కన్ఫర్మ్ చేసింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుండడంతో కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో అంచనా వేయడానికి మరి కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ విశ్వక్ సేన్ రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు హెల్ప్ అవుతుంది.
ఒక సినిమా విజయం ఆ నటుడి నెక్ట్స్ సినిమాకు హెల్ప్ అవ్వడం సహజం. గామి విజయం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అవసరమైన బూస్ట్ ఇస్తుంది. మరో 2 నెలల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. ఎప్పుడు రిలీజ్ అయినా ఈ సినిమాకి ఖచ్చితంగా పాజిటివ్ వైబ్ ఉంటుంది.
ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని కూడా విశ్వక్ సేన్ తో కమర్షియల్ గా సక్సెస్ చేయవచ్చని నిరూపించిన సినిమా గామి. అందుకే ఆయన తదుపరి సినిమాలన్నింటికీ మినిమమ్ గ్యారంటీ ఫ్యాక్టర్ ఉంటుంది. అంతే కాకుండా విశ్వక్ లైలా అనే సినిమాకు సంతకం చేశాడు. ఇందులో అతను లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. దాస్ కా ధమ్కీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు విశ్వక్.
ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విషయానికి వస్తే అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.