Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గామి’ గత వారం (మార్చి 8) థియేటర్లలో విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్, మేకింగ్ తో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించి బాక్సాఫీస్ కలెక్షన్లను వసూలు చేస్తోంది. దీంతో భారీ సక్సెస్ దక్కించుకుందని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఈ నేపథ్యంలో హీరో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఎప్పటి లాగే తన మనసులోని మాటను బయటపెట్టాడు.
దశాబ్దం తర్వాత కూడా గామి గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని విశ్వక్ సేన్ అన్నారు. ఇతర భాషా చిత్రాల గురించి మాట్లాడడం, ట్వీట్ చేయడం లాంటివి చేసే ఇండస్ట్రీలోని పెద్దలపై సున్నితంగా వ్యాంగ్యాస్త్రాలను సంధించారు. ‘సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు గామి చూసి మాట్లాడితే బాగుండేది’ అని విశ్వక్ అన్నారు.
గామి సక్సె్స్ దిశగా దూసుకుపోతుండడంతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యర్థులపై దృష్టి పెట్టేందుకు తనకు సమయం లేదని విశ్వక్ సేన్ చెప్పుకచ్చారు. గామిని అర్థం చేసుకోలేదంటూ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. సినిమా అర్థం కాకపోతే మళ్లీ చూడాలని లేదా అర్థం చేసుకున్న వాళ్లను అడిగి కంటెంట్ గురించి తెలుసుకుంటే సరిపోతుందని విశ్వక్ సూచించాడు. ‘గామి ఏమీ రాకెట్ సైన్స్ కాదు, శ్రద్ధ పెడితే సులభంగా అర్థమవుతుంది’ అన్నాడు విశ్వక్ సేన్.
ప్రస్తుతం గామి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ సేన్ తన తర్వాతి మూవీ గ్యాంగ్స్ గోదావరి మరింత సక్సెస్ సాధిస్తుందని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.