32.6 C
India
Saturday, May 18, 2024
More

    Vishwak Sen comments : ‘బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు గేమ్ మార్చేస్తాడు’.. విశ్వక్ కామెంట్స్ ఎవరి మీద?

    Date:

    Vishwak Sen comments
    Vishwak Sen comments
    Vishwak Sen comments : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈయన ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు.. తన స్టైల్ అండ్ యాటిట్యూడ్ తో బాగా గుర్తింపు పొందారు. ఇక విశ్వక్ ధమ్కీ వంటి హిట్ తర్వాత ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాను చేస్తున్నాడు.
    సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక విశ్వక్ సరసన డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి నటిస్తుంది. విశ్వక్ ఇప్పటి వరకు మంచి మంచి విజయాలు సాధించిన బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ సినిమా ఇంకా పడలేదు.. అందుకే ఈయన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమాను చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
    అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏం జరిగిందో తెలియదు విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
    బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అని అనుకుంటాడు.. డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రమోషన్స్ లో చూడరు అంటూ ట్వీట్ చేసాడు. ముందుగా డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.. కానీ ఆ తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ టాక్ వస్తుంది.
    అయితే ఇప్పుడు మరింత ముందుకు వెళుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశ్వక్ ఈ రేంజ్ లో ఫైర్ అయ్యారని తెలుస్తుంది. ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడో తెలియదు కానీ ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. చూడాలి కొత్త డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో..

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishwak Sen : ‘గామి’ గురించి వారిని మాట్లాడాలని కోరిన విశ్వక్ సేన్..

    Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గామి’...

    Vishwak Sen : విశ్వక్ సేన్ వివాదంపై బేబీ డైరెక్టర్ ఫైనల్ క్లారిటీ.. ఏం చెప్పారంటే?

    Vishwak Sen  ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన...

    Vishwak Sen Vs Sai Rajesh: విశ్వక్ సేన్ తో వివాదంలో అసలు విషయాలు బయటపెట్టిన సాయి రాజేష్

    Vishwak Sen Vs Sai Rajesh: ప్రస్తుతం బేబి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది....