Vishwak Sen ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ బేబీ.. మరి అలాంటి సినిమా విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ కు, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ కు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.. బేబీ సక్సెస్ ఈవెంట్ లో ముందు ఈ సినిమా కథను ఒక హీరో వినేందుకు కూడా ఇష్టపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
మరి ఈ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ హర్ట్ అవ్వడంతో ఈయన కూడా ఒక సినిమా ఈవెంట్ లో కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుండి సాయి రాజేష్, విశ్వక్ సేన్ మధ్య వివాదం మరింత పెరుగుతూనే ఉంది.. ఇది ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది.. తాజాగా ఈ విషయంపై బేబీ డైరెక్టర్ మళ్ళీ స్పందించారు.. ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఈ వివాదం గురించి కూడా మాట్లాడారు.
ఈ వివాదం గురించి వివరణ ఇస్తూ.. ఈ వివాదాన్ని పెద్దది చేయడం తనకు ఇష్టం లేదని.. తాను డైరెక్ట్ గా విశ్వక్ సేన్ ను సంప్రదించలేదని గీతా ఆర్ట్స్ వారు సంప్రదించగా ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో అలానే తనకు చెప్పారని, ఫిల్టర్ చేసి చెప్పి ఉంటే బాగుండేది అని విశ్వక్ సేన్ ఏమన్నాడో అదే తనకు చెప్పడం బాధగా అనిపించింది అని అన్నారు.
నో అని చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని అలా కాకుండా ఆయన చెప్పిన విధానం బాధ కలిగించింది అని తెలిపారు.. విశ్వక్ సేన్ పరిస్థితి కూడా నాకు అర్ధం అవుతుంది కొత్త వాళ్ళను ఎందుకు నమ్మాలి అని తాను అనుకుని ఉండవచ్చు.. ఏ రోజు తనని నేను ఇన్సల్ట్ చేసేలా మాట్లాడలేదు.. ఆనంద్ గురించి చెప్పే సమయంలో తన గురించి చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు..