36.9 C
India
Sunday, May 5, 2024
More

    Vishwak Sen Vs Sai Rajesh: విశ్వక్ సేన్ తో వివాదంలో అసలు విషయాలు బయటపెట్టిన సాయి రాజేష్

    Date:

    Vishwak Sen Vs Sai Rajesh:
    Vishwak Sen Vs Sai Rajesh

    Vishwak Sen Vs Sai Rajesh:

    ప్రస్తుతం బేబి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చిన్న సినిమానే అయినా పెద్ద విజయం నమోదు చేసింది. రూ. వంద కోట్ల కలెక్షన్ల వైపు పరుగులు పెడుతోంది. పెద్ద సినిమాలు చతికిల పడినా బేబి మాత్రం దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రస్తుతం పరిశ్రమనే షేక్ చేస్తోంది. బేబి హిట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టార్ హీరోలు కాకపోయినా బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుని పోటీలో నిలవడం గమనార్హం.

    ఈ సినిమా మొదట విశ్వక్ సేన్ ను హీరోగా అనుకున్నారట. కానీ అతడు దర్శకుడి కథ వినడానికి కూడా సమయం ఇవ్వలేదట. తరువాత దర్శకుడు సాయి రాజేష్ ఓ హీరో తన కథ కూడా వినలేదని అనడంతో ఇద్దరి మధ్య వివాదం రేగింది. చివరకు మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. బేబి సినిమా విజయం తరువాత ఇద్దరి మధ్య మాటల వార్ కొనసాగింది.

    అతడు తన కథ ఎందుకు వినలేదో తెలియదు. బహుశా ఆయన ప్రాధాన్యత జాబితాలో తన పేరు లేకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు. అతడు తిరస్కరించిన విధానానికి బాధపడ్డానని ఓపెన్ అయ్యాడు. అతడి మొదటి సినిమా వెళ్లిపోమాకే సినిమా బయటకు రావడానికి ఎంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి నిర్మాతలను కలిసి వాళ్లకు సినిమా చూపించి విడుదలయ్యే వరకు చాలా కష్టపడ్డాను.

    విశ్వక్ సేన్ వద్దనుకోవడంతో సినిమా ఆనంద్ దేవరకొండకు చేరింది. వారు నమ్మి చేసినందుకు హిట్ సాధించింది. ఇప్పటికే రూ. 80 కోట్లు వసూళ్లు దాటింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య నటన ఆకట్టుకుంది. 2023లో మంచి లాభాలు సాధించిన చిత్రంగా రికార్డులు సాధించడం గమనార్హం. మొత్తానికి వీరిద్దరి వివాదంతో కూడా సినిమాకు ప్లస్ అయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related