32.6 C
India
Saturday, May 18, 2024
More

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Date:

    Tarun
    Tarun

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు లాంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగులో 2000 సంవత్సరం నుంచి 2005 వరకు  టాప్ హిరోగా కొనసాగాడు. ఎక్కడ ఉన్న పక్కన నువ్వే సాంగ్ వింటే చాలు తరుణ్ అని చెప్పేసేలా ఆ పాటలో ఒదిగిపోయాడు.

    తరుణ్ కెరీర్ లో ముందు బాలనటుడిగా నటించాడు. తర్వాత హిరోగా మారి చాలా హిట్స్ కొట్టాడు. మెల్లి మెల్లిగా ఫ్లాప్ మూవీస్ రావడంతో అతడి సినీ కెరీర్ ముగిసింది. అలీతో ఓ షోలో తరుణ్ మాట్లాడుతూ… చేస్తే హిరోగానే చేస్తా.. కానీ క్యారెక్టర్లు చేయనని కరాఖండిగా చెప్పేశాడు. తరుణ్ తల్లి ఒకప్పటి హిరోయిన్ రోజా రమణి. ఆమె అంటే తరుణ్ కు చాలా ఇష్టం.

    అయితే సినిమాలు తగ్గిన తర్వాత తరుణ్ వ్యాపారాలపై దృష్టి సారించాడు. పబ్ లు, ఇతర వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు. అయితే వివాదాలు కూడా అంతే రేంజ్ లో తరుణ్ ని చుట్టుముట్టాయి. డ్రగ్స్ కేసులో తరుణ్ పేరు వినిపించడంతో ఏంటీ ఇతడు కూడా ఇలాంటి వాడేనా అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

    ఈ సందర్భంగా రోజారమణి సంచలన విషయాలు చెప్పింది. తరుణ్ కు నేను ఇప్పటి వరకు పెళ్లి చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది తరుణ్ కు మూడు పెళ్లిళ్లు చేసేశారు. అది కూడా మార్పింగ్ లతో హిరోయిన్లతో పెళ్లి చేసేశారు. తరుణ్ తో నటించిన ప్రియమణి, శ్రియ, త్రిష కూడా ఫోన్ చేసి తరుణ్ కు ఎప్పుడూ పెళ్లి చేశారు అంటీ అని అల్లరి పట్టిస్తుంటారు. అయినా సెలబ్రెటీల జీవితాల్లో సినిమాల్లోనే కాదు. బయట కూడా సోషల్ మీడియాలో పెళ్లిళ్లు చేసేస్తుంటారు. కానీ తరుణ్ కు నచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని చెప్పినపుడు మాత్రం తప్పకుండా పెళ్లి చేస్తానని మాటిచ్చాడు.

    Share post:

    More like this
    Related

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tarun : మెగా అల్లుడిగా తరుణ్! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

    Tarun మెగా కుటుంబం నుంచి ఏ చిన్న విషయం లీక్ అయినా...

    Ananth Prabhu : శ్రీకాంత్, తరుణ్ అవమానించారు.. నోరుమూసుకుని ఉండమన్నారు.. అనంత్ ప్రభు

    Ananth Prabhu : అనంత్ ప్రభు తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే.....

    Manmadudu Missed : మన్మథుడు మిస్ చేసుకున్న ఆ హీరో.. చేసి ఉంటే కెరీర్ మరో లెవల్ లో ఉండేదిగా!

    Manmadudu Missed : ఏ ఇండస్ట్రీలో అయిన ఒక్కో సినిమా ఎప్పటికి...

    Tarun : ఆ సమయంలో తరుణ్ ను చూసి ఏడుపు వచ్చింది.. రోజా రమణి కామెంట్స్ వైరల్!

    Tarun : తరుణ్.. ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.. టాలీవుడ్...