29.5 C
India
Sunday, May 19, 2024
More

    Gita Gana Pravachanam : ‘గీతా గాన ప్రవచనం’..  16న వైభవంగా నిర్వహించనున్న సాయిదత్త పీఠం.. 

    Date:

    Gita Gana Pravachanam
    Gita Gana Pravachanam

    Gita Gana Pravachanam : భూమిపై పుట్టిన ప్రతీ ప్రశ్నకు భగవత్ గీతలో సమాధానం ఉంటుంది. మానవ జీవనం గమనం, గమ్యం భగవత్ గీతపైనే ఆధారపడ్డాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇతర మత గ్రంథాలు పుట్టడం కంటే హిందూ గ్రంథంగా చెప్పుకునే భగవత్ గీత ఆవిర్భవించింది. యుద్ధ రంగంలో అర్జునుడు బంధుప్రీతితో యుద్ధం చేయలేనని అస్త్రాలను త్వజించగా.. అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతాసారం ప్రభోదం చేశాడు. అదే సనాతన ధర్మానికి ఆరాధ్య గ్రంథంగా ఆవిర్భవించింది.

    భగవత్ గీత ఫౌండేషన్ ఫౌండర్ గంగాధర శాస్త్రి గీతా సారాన్ని సమస్త మానవాళికి అందిస్తున్నారు. భారత దేశం తో పాటు విదేశాలకు వెళ్లి ప్రవచనాల రూపంలో గీతను భోదిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన అమెరికాలో ప్రవచనం ఇవ్వనున్నారు. న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ‘గీత గాన ప్రవచనం’ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు.

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే శివ విష్ణు దేవాలయం ఆధ్వర్యంలో ఈ గీత గాన ప్రవచనం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 16 (శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి ఆలయం కమ్యూనిటీ హాల్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) తెలుగు ఫైన్ ఆర్ట్స్ సోసైటీ, తెలుగు కళాభారతి సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.

    మరిన్ని వివరాలకు టెంపుల్ ఫ్రంట్ డెస్క్ 732-809-1200, 732-662-3250, 3251, 3252, రఘు శర్మ సంకరమంచి 516-359-8178, ప్రసాద స్వామి ఊటుకూరు 732-789-0272, మధు రచికుల 201-312-1305, శ్రీనివాస్ గనగోని 732-429-4855.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....