35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Gunneru Flower : రోడ్ల పక్కన గన్నేరు పూల చెట్లు ఎందుకు పెడతారో తెలుసా?

    Date:

    Gunneru flower
    Gunneru flower

    Gunneru Flower : చెట్లు పర్యావరణానికి మెట్లు. చెట్టు పెంచితే మన వాతావరణం కలుషితం కాకుండా కాపాడతాయి. చెట్లలో అంతటి మహత్తర శక్తి ఉంటుంది. అందుకే వాటి సంరక్షణకు ప్రభుత్వం కూడా నడుం బిగించింది. అడవుల విస్తీర్ణం పెంచి పర్యావరణ పరిరక్షణ చేయాలని భావించింది. ఇందులో భాగంగానే మొక్కల పెంపకం కోసం హరిత హారం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లింది. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని చాటింది. ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది.

    మనం హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు రోడ్డు మధ్యలో పక్కలో గన్నేరు మొక్కలను చూస్తుంటాం. ఇవి చూడముచ్చటగా అందంగా కనిపిస్తాయి. కానీ రోడ్ల మీద ఈ మొక్కలనే ఎందుకు పెంచుతారనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అందులో ఉన్న మర్మమేమిటో తెలుసుకోవాలని అనిపించా? అయితే ఓ లుక్కేద్దాం రండి.

    గన్నేరు మొక్కలు రద్దీగా ఉండే హైవేపై అందంగా కనిపిస్తాయి. ఇందులో దాగున్న రహస్యం ఏంటంటే ఇవి గాలిలోని విషపూరితమైన వ్యర్థాలను స్వచ్ఛమైన ఆక్సిజన్ గా మారుస్తాయి. దట్టమైన ఆకులు కలిగి ఉండటం వల్ల గాలి నుంచి కార్బన్ డై ఆక్సైడ్ ను సులభంగా గ్రహిస్తుంది. గన్నేరు మొక్కకు నీరు కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటుంది.

    గన్నేరు మొక్క నేల కోత, శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎదురుగా వచ్చే వాహనం హెడ్ లైట్ వెలుతురు ఇతర వాహనాల మీద పడకుండా చేసతుంది. ఇంకా దీని ఆకులు మేకలు, ఇతర జంతువులు తినవు. హైవేల మీద అందం కోసమే కాకుండా ఇలాంటి కారణాల రీత్యా వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. చూడటానికి అందంగా కూడా కనిపిస్తాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...