41.1 C
India
Monday, May 20, 2024
More

    RRR and Pushpa : ఆర్ఆర్ఆర్.. పుష్ప మూవీస్ నాకు నచ్చలే.. అందులో ఏముంది.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు..

    Date:

    RRR and Pushpa
    RRR and Pushpa

    RRR and Pushpa : బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నసీరుద్దీన్ షా.. పాన్  ఇండియన్ మూవీస్ అయిన ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమాలు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి పేరును సంపాదించుకున్నాయి. ఆర్ఆర్ఆర్ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీస్ నుంచి గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ తర్వాత మళ్లీ ఆస్కార్ రేసులో నిలిచి అవార్డు సొంతం చేసుకున్న రెండో మూవీగా దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచిన విషయం తెలిసిందే.

    తాజాగా ఆర్ఆర్ఆర్‌‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు  పాన్ ఇండియన్ స్టార్‌ క్రేజ్ తెచ్చిపెట్టిన పుష్ప మూవీ తను పూర్తిగా చూడలేకపోయానని బాలీవుడ్ స్టార్ యాక్టర్ నసీరుద్దీన్ షా చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పోలిస్తే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం మూవీ పూర్తిగా చూడగలిగానని అన్నారు. మణిరత్నం చాలా గొప్ప దర్శకుడని, ఆయన సినిమాల్లో ఎలాంటి ఎజెండా, ప్రొపగండా లేకుండా చిత్రాలు రూపొందిస్తారన్నారు.

    వాస్తవానికి ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల్లో పురుషుల ఆధిపత్యం, జిమ్  బాడీలు చూపించడం మాత్రమే కనిపించిందని అన్నారు. ఆర్ ఆర్ఆర్ మూవీని  మహిళా ప్రేక్షకులు ఇష్టపడతారని నేను అనుకోవడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏదో ఎజెండాతో బ్రాండ్ కోసం తీసినట్లుగా ఉందని చెప్పకుండానే చెప్పేశారు.  గతంలో ఈయన ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ చిత్రాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

     బడా దర్శకుల సినిమాలను వ్యతిరేకించే ఆయన అదే సమయంలో యంగ్ ఫిలిం మేకర్స్పై ప్రశంసలు కురిపించారు.రామ్ ప్రసాద్ కి తెహర్వీ, గుల్మోహర్ వంటి చిత్రాలకు  సరైన గౌరవం దక్కాలన్నారు. కాగా,ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేసులో నిలిచిన టైంలో అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కమెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజ డైరెక్టర్లు రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్న విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jakkanna-Sukumar : సుక్కూపై జక్కన్న అభిమానం..చరణ్ సినిమాపై అప్పుడే చెప్పేశాడు..

    Jakkanna-Sukumar : ఒకరు బహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు....

    Mahesh Babu : మహేశ్ కోసం ఆ బ్యూటీని లైన్ లో పెట్టిన రాజమౌళి.. ఆ హీరోయిన్ ఎవరంటే?

      Mahesh Babu : అనౌన్స్ చేసిన డేట్ రోజే (జనవరి 12)...

    Rajamouli : రాజమౌళిని భయపెడుతున్న ప్రశాంత్ నీల్? 

    Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు...