35.1 C
India
Thursday, May 9, 2024
More

    Jakkanna-Sukumar : సుక్కూపై జక్కన్న అభిమానం..చరణ్ సినిమాపై అప్పుడే చెప్పేశాడు..

    Date:

    Jakkanna-Sukumar
    Jakkanna-Sukumar

    Jakkanna-Sukumar : ఒకరు బహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. మరొకరు పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేశారు. వారే సుకుమార్, రాజమౌళి. వీరి అనుబంధం కూడా మనకు తెలిసిందే. ‘జగడం’లో సుకుమార్ టేకింగ్ కు మురిసిపోయి అందులో ఓ సన్నివేశం గురించి రాజమౌళి తన అనుభవాన్ని పంచుకోవడం చాలా మందికి తెలిసే ఉంటుంది. సుకుమార్ లోని క్రియేటివిటీని మాస్ పల్స్ ను సాటి దర్శకుడిగా రాజమౌళి వివరించి చెప్పడం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. అక్కడితో అయిపోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా సుకుమార్ పై తన అభిమానాన్ని తెలియజేస్తూనే ఉన్నారు రాజమౌళి.

    మహేశ్ బాబుతో సుకుమార్ తీసిన ‘వన్- నేనొక్కడినే’ బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. తిక్క సినిమా అంటూ అనేక రివ్యూలు వచ్చాయి. ఆ సమయంలో కూడా సుకుమార్ కు అండగా నిలిచాడు రాజమౌళి. ఆ సినిమాలో సుకుమార్ టేకింగ్, క్రియేటివ్ స్కిల్స్ ను ప్రశంసిస్తూ ఓ స్పెషల్ వీడియో కూడా చేశాడు. రాజమౌళి వీడియో చేసిన తర్వాత ఆ సినిమాలోని ప్రత్యేకత ఏమిటో ఇంకాస్త జనాల్లోకి వెళ్లింది.

    ఇప్పుడు సుకుమార్-రామ్ చరణ్ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారు. ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా అంచనాలు ఆకాశానికి తాకాయి. దీనికి కారణం కూడా రాజమౌళినే. ఓ సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడారు జక్కన్న. ‘‘రామ్ చరణ్ తో సుకుమార్ తీయనున్న సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ ఓ అద్భుతం. నేను దీని గురించి ఇంతకుమించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’’ అని రాజమౌళి గతంలో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ సినిమా అనౌన్స్ మెంట్ కంటే రాజమౌళి కామెంటే గొప్ప బజ్ క్రియేట్ చేసింది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య ఇంతటి చక్కని అభిమానం స్నేహపూర్వక వాతావరణం ఉండడం మెచ్చుకోదగ్గ విషయమే.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...