41.1 C
India
Monday, May 20, 2024
More

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Date:

    Maruti Suzuki Swift
    Maruti Suzuki Swift

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌ బ్యాక్‌ మోడల్‌ కార్లలో ‘మారుతీ సుజుకీ స్విఫ్ట్‌’ ఒకటి. దీని 2024 అప్‌డేటెడ్ వెర్షన్‌ గురువారం (మే 09) రోజున విడుదలైంది. కొన్ని ఫీచర్లను మార్చామని, కానీ డిజైన్ ను మార్చలేదని చెప్పింది.

    1.2 లీటర్ల 3 సిలిండర్‌ జెడ్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కొత్త దానిలో తీసుకొచ్చింది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ అనుసంధానించింది. 80 బీహెచ్‌పీ గరిష్ట శక్తితో పాటు 112 ఎన్‌ఎం టార్క్‌ రిలీజ్ చేస్తుంది. లీటర్‌ ఇంధనంకు 25.72 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

    లోపల ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్‌ తీర్చిదిద్దారు. యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతో ఏడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ అందిస్తోంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీల కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్, బ్యాక్ ఎండలో ఏసీ వెంట్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

    కొత్త స్విఫ్ట్‌ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. బేసిక్ మోడల్ రూ.6.50 లక్షల నుంచి టాప్ ఎండ్ రూ.9.65 లక్షల వరకు ఉంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది.

    ఇక, డిజైన్‌ పరంగా చూస్తే బంపర్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌ అమర్చారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో హెడ్‌ల్యాంప్‌ ఇచ్చారు. వెనకభాగంలో స్కిడ్‌ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్‌ అమర్చారు. సీ టైప్ డీఆర్‌ఎల్‌లతో ప్రత్యేకమైన లైట్లను జత చేశారు.

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related