30.2 C
India
Wednesday, May 1, 2024
More

    Second-Hand Cars : సెకండ్‌ హ్యాండ్ కార్లలో వీటికే డిమాండ్ ఎక్కువ.. వాటిలో ప్రత్యేకతలు ఏంటి?

    Date:

    Second-Hand Cars : భారత ఆటో మార్కెట్ లో రాను రాను ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. నాన్‌- మెట్రో నగరాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఎస్‌యూవీలపై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. 40 శాతం కార్ల యూజర్లు ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

    దేశీయ మార్కెట్ లో ప్రజలు ఎస్‌యూవీలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు సంబంధించి యూజ్డ్‌ కార్ల మార్కెట్ పెరగడంతో భారతీయ ఆటో పరిశ్రమ SUV వృద్ధి చెందుతోందని నివేదికలు చెప్తున్నాయి. స్టైలిష్‌ లుక్‌తో పాటు మెరుగైన పనితీరు ఆధారంగా ఆదరణ పెరుగుతోంది.

    ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు తాము కొనుగోలు చేయాలనుకునే వాహనాల్లో ఆధునిక ఫీచర్లను ఎంచుకుంటున్నారు. అందుకే ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలు ఎస్‌యూవీల్లో అత్యాధునిక ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆటో మేటిక్‌ ఫీచర్లకు ప్రాధాన్యత పెరగడంతో ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు.
    దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ ఎస్‌యూవీలకు ఆదరణ రాను రాను పెరుగుతోందని నివేదికలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓనర్‌ కార్ల మార్కెట్‌ పెరిగినట్లు చెబుతున్నాయి. ఫలితంగా రూ. 1,385 కోట్ల లావాదేవీలు జరిగాయి.

    నాన్‌- మెట్రో నగరాల్లో ఎస్‌యూవీ అమ్మకాలు పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అహ్మదాబాద్‌, జైపూర్‌, లక్నో, కొచ్చి నగరాల్లో యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. టైర్‌- 2, టైర్‌- 3 నగరాల్లో ఈ వృద్ధిలో 30 శాతం పెరుగుదల నమోదవుతుంది.

    ఫోర్డ్-ఈకోస్పోర్ట్స్, హ్యుందాయ్-క్రెటా మోడళ్లు ఆధిపత్యం చేస్తున్నాయి. హ్యాచ్‌ బ్యాక్‌ విభాగంలో మారుతీ సుజుకీ-స్విఫ్ట్‌, బ్యాలెనో వంటి కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి. బ్రెజా మోడల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.
    ఇక ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆటోమేటిక్ కార్ల అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది. 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటోమేటిక్‌ కార్లలో సౌలభ్యం, లగ్జరీ ఉండడంతో కస్టమర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్‌యూవీలలో సన్‌రూఫ్‌,  అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు తప్పనిసరి అయ్యాయి.

    వాహనదారులు తమ ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేని డ్రైవింగ్‌ కోరుకుంటున్నారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన ఫీచర్ల ద్వారా డ్రైవింగ్‌ సులభంగా ఆస్వాదిస్తున్నారు. మైలేజ్, మెయింటెనెన్స్‌ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటున్నారని నివేదికలు చెప్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Automatic Vs Manual : ఆటోమేటిక్ వర్సెస్ మాన్యువల్.. ఏ గేర్ అంటే ఇండియన్స్ కు మోజు..

    Automatic Vs Manual : కొవిడ్ తర్వాత భారత్ లో ఆటో...

    Summer : సమ్మర్ లో కార్లలో ఈ వస్తువులను అసలే ఉంచొద్దు!

    Summer : మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ...

    Top-10 Cars : జనవరిలో ఎక్కువ ఆదరణ పొందిన కార్లు ఇవే?.. టాప్ 10 చూద్దాం..

    Top-10 Cars : గత నెల (జనవరి) అమ్మకాల జాబితాలను దేశీయ...