ODI World Cup ఆట ఏదైనా భారత్ వర్సెస్ పాక్ అంటే ఆ క్రేజే వేరు. ఇక క్రికెట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది అనడంలో అస్సలు సందేహం లేదు. ఇకా దాయాదితో పోరులో ఆటగాళ్లు విజృంభించే విధానం చెప్పడం ఎవ్వరితరం కాదు. గత మ్యాచ్ లే ఇందుకు నిదర్శనం. వీటితో పాటు ఇప్పుడు మరో మ్యాచ్ మన ముందుకు వస్తుంది.
ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఈ సంవత్సరంలో ప్రారంభం కానుంది. అందులోనూ భారత్ లో ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ న మ్యాచ్ మొదలవనుంది. ఇండియా, పాకిస్ధాన్ జట్ల మధ్య జరిగే ఏ క్రికెట్ మ్యాచ్ అయినా ఎంతో ఉత్కంఠను రేపుతుంది. అందులోనూ వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్లు తలపడటాన్ని అన్ని దేశాలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నాయి. అయితే దాయాది జట్లు పాల్గొనే మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 న జరగాల్సి ఉంది. కానీ కొన్ని భధ్రతా కారణాల దృష్ట్యా రీ షెడ్యూల్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
వరల్డ్ కప్ లో భాగంగా ఐసీసీ(ICC) షెడ్యూల్ ప్రకారం ఈ రెండు టీం ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15 వ తేదీన అహ్మదాబాద్ లో ఉండేది. అయితే అదే రోజు గుజరాత్ రాష్ట్రమంతా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని బీసీసీఐ(BCCI) కి భధ్రతా సంస్ధలు సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక లో వచ్చిన కథనం ప్రకారం తెలుస్తుంది.
వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్రాలతో ఢిల్లీ లో సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ సమావేశం లోనే అహ్మదాబాద్‌లో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 14కు మార్చడానికి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.