- కర్ణాటక ఫలితాలతో దేశవ్యాప్తంగా మారిన మూడ్
- త్వరలోనే ఢిల్లీలో కీలక సమావేశం

Congress the alternative : కాంగ్రెస్.. వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ.. ఎన్నో ఏండ్లు దేశాన్ని పాలించింది. అయితే 2014 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ను కోలుకోకుండా చేసింది. అన్ని రాష్ర్టాల్లో కాషాయ జెండా ఎగరేసుకుంటూ వెళ్లింది. మోదీ ఛరిష్మా దేశ వ్యాప్తంగా ఒక నినాదమైంది. అదే రెండో సారి కూడా ఆయనను అధికారంలో కూర్చోబెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను సైతం బీజేపీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదల్లేదు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనని భావించిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేక కొందరు సీనియర్లు కూడా బహిరంగంగానే పార్టీపై మాట్లాడడం చాలా చేటు చేసింది. దీంతో ఇప్పట్లో ఇక పార్టీ కోలుకోవడం కష్టమే అంతా భావించారు అయితే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కర్ణాటక విజయంతో..
కర్ణాటక విజయం ఎన్నో సంకేతాలను ఇచ్చింది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ( the alternative) కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టమైంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతే 2024 ఎన్నికల్లో దీటైన జవాబు బీజేపీకి ఇవ్వచ్చని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే విపక్షాల భేటీ ఉంటుందని తెలుస్తున్నది. సోనియా గాంధీ నేతృత్వంలో ఈ మీటింగ్ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపేతర పార్టీలన్నీ ఈ మీటింగ్ కు వస్తాయని అంతా భావిస్తున్నారు.
టార్గెట్ 2024 లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొండ లాంటి బీజేపీని ఎదుర్కోవాంటే అన్ని పార్టీల మద్దతు అవసరం. మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్, కేజ్రివాల్ వంటి నేతలు కూడా కాంగ్రెస్ తో నడిచేందుకు సిద్ధమైతే 2024 ఎన్నికల్లో ఇక బీజేపీకి కష్టకాలమే. మరోవైపు పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓడితే ఇక కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక ఇద్దరు క్రియాశీలక పనుల్లో నిమగ్నమయ్యారు. వారు అన్ని రాష్ర్టాల్లో పరిస్థితిని పార్టీ శ్రేణులతో తెలుసుకుంటున్నారు.
త్వరలో జరిగే ఐదు రాష్ర్టాల ఎన్నికలపై కూడా వారు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని తెలిసింది. కర్ణాటకలో పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పోలిటికల్ స్ర్టాటజిస్ట్, వ్యూహకర్త సునీల్ కొనుగోలును అన్ని రాష్ర్టాల్లో రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన టీం ఇప్పటికే తెలంగాణలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో బీజేపీ తన పరిస్థితిని సమీక్షించుకుంటుందా. లేక కుల, మత రాజకీయాలపైనే అధారపడి రాజకీయం చేస్తుందా వేచి చూడాల్సి ఉంది.