
Jagan React Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబును జైల్లో పెట్టడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు మొదటిసారి పెదవి విప్పారు. దొంగను జైల్లో పెడితే అతడి వెంబడి పలుకుబడి కలిగిన వ్యక్తులు అండగా నిలవడం వింతగా ఉందని విచారం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో సాక్ష్యాధారాలతో జైలుకు పంపితే సానుభూతి చూపించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు దొంగతనాలు చేసినా నీతిపరుడిగా బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీలో అడ్డంగా బుక్కయినా బుకాయించారు. పత్రికలు, టీవీల్లో నిజాలు చూపించకపోయినా అదే నిజం అని అందరికి తెలిసినా చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో ఇప్పుడు జైలుకు పంపితే ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
అవినీతి, అక్రమాలు చేసే వారికి జైల్లే సరైన స్థలాలని పేర్కొన్నారు. టీవీలు, పత్రికలు నిజాలను వక్రీకరించి చెబుతున్నాయి. అవినీతికే మద్దతు ఇస్తున్నాయి. అందుకే చంద్రబాబుకు వక్కాసు పలుకుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో తెలియడం లేదు. ప్రతిపక్ష నేతను దురుద్దేశంతోనే జైల్లో పెట్టించిన జగన్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. దీంతో జగన్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. సీఎం జగన్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని టీడీపీ నేతలు బదులిస్తున్నారు. జగన్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.