36 C
India
Monday, April 29, 2024
More

    AP CID About Chandrababu Arrest : చంద్రబాబుకు మళ్లీ అరెస్ట్ తప్పదా?.. ఏపీ సీఐడీ ఆలోచనేంటి..?

    Date:

    AP CID About Chandrababu Arrest
    AP CID About Chandrababu Arrest
    AP CID About Chandrababu Arrest : స్కిల్ స్కామ్‌లో  కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రెండు రోజుల క్రితం బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఒక కేసులో వస్తే మరో రెండు మూడు కేసుల్లో అరెస్టు చేస్తారనే ప్రచారం జగుతున్నది. స్కిల్ స్కాం తర్వాత ఫైబర్ గ్రిడ్‌లో అరెస్టు చేస్తారు. అక్కడ‌ బెయిల్ తెచ్చుకుంటే రింగ్ రోడ్డు కుంభకోణంలో అరెస్టు తప్పదు. ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ల కేసులో అరెస్టుకు సిద్ధంగా ఉండాలి.

    బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్ట్ తప్పదా?
    క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు జైలులో ఉన్న విషయం  తెలిసిందే. ఎట్టకేలకు స్కిల్ స్కామ్ కేసులో బాబుకు బెయి ల్ వచ్చింది. మరో మూడు కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్ల అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది.

    స్కిల్ స్కామ్‌లో  బయటికి వచ్చిన చంద్రబాబును సీఐడీ, పోలీసులు అరెస్టు చేయటానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ కేసుల్లో చంద్రబాబును ఎప్పుడైనా అరెస్టు చేయచ్చు. స్కిల్ స్కామ్‌లో బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబును ముందుగా ఫైబర్ గ్రిడ్‌లో అరెస్టు చేయడానికి  సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ ఫైబర్ స్కామ్‌లో బెయిల్ వస్తే రింగ్ రోడ్డు కుంభకోణంలో అరెస్టు తప్పదు. ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ల కేసులోనూ అరెస్టుకు  చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తు్న్నది.

    చంద్రబాబును అరెస్టు చేయటానికి ఇలా కేసు మీద కేసు రెడీగా ఉన్నాయి. ఇదే విషయమై న్యాయనిపుణులు మాట్లాడుతూ.. అన్నీ కేసుల నుంచి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేందుకు కనీసం ఫిబ్రవరి అవుతుందంటున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ కూడా డిస్మిస్ అవటానికే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు.స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. వీటిని క్వాష్ చేస్తే 17-A వర్తించే ఏ కేసులోనూ బాబును అరెస్టు చేసే అవకాశం ఉండదు. అయితే గవర్నర్ అనుమతి తీసుకుని కొత్త కేసులు పెడితే అరెస్టు చేయొచ్చు.

    ఒక వేళ ఆయా కేసుల్లో అరస్టయితే మాత్రం  ఫిబ్రవరిలో బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు ముందు మాత్రమే సంపూర్ణంగా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా ఇది వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు టీడీపీకి చాలా ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి వరకు బెయిల్ దొరకడం కష్టమంటే పొత్తులు, సీట్ల షేరింగ్, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ప్రచారం కూడా హడావుడిగా చేసేయాల్సి ఉంటుంది. అయితే తన పరిస్థితిని చంద్రబాబు సింపతీ కోసం వాడుకుంటారనడంలో సందేహంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    CM Jagan : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

    CM Jagan : నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...