34.7 C
India
Friday, May 17, 2024
More

    King maker : కర్ణాటక కింగ్ మేకర్ ఆయనేనా..?

    Date:

    • ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదేనా..
    • మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కష్టమంటున్న సర్వేలు
    king maker of Karnataka
    king maker, karnataka-elections-2023

    king maker of Karnataka : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ముగిశాయి.  వివిధ సంస్థలు, ఛానళ్ల సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. మిక్కిలి సంఖ్యలో సర్వేల్లో కాంగ్రెస్ కే అధికారమని తేలుతున్నా, మరికొన్ని బీజేపీ గట్టి పోటీనిచ్చిందని కచ్చితంగా అధికారం నిలబెట్టుకుంటుందని చెబుతున్నాయి. ఒకవేళ అటు.. ఇటుగా సీట్లు వస్తే జేడీఎస్ నేత ఇక్కడ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

    కుమారస్వామి నెగ్గుతాడా..?
    ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ అనిపించినా, జేడీఎస్ కూడా ఇక్కడ గట్టి పోటీదారు అనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్కు 107-119 ఇవ్వగా, బీజేపీకి 90 వరకు వస్తాయని చెప్పింది. జీ న్యూస్ కాంగె్రస్ 103-119 ఇవ్వగా, బీజేపీకి కేవలం 94 రావొచ్చని చెప్పింది. అయితే సీ ఓటర్, సువర్ణ న్యూస్, తదితర సంస్థలు కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఖాయమని తమ సర్వేలో వెల్లడించాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ ముందంజలో ఉన్నా, మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాయా అనేది సంశయం. ఒక వేళ ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకుంటే జేడీఎస్ మద్దతు కీలకంగా మారనుంది. కుమారస్వామి కింగ్ మేకర్ కానున్నారు.

    113 సీట్లు సాధ్యమేనా..?
    కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నేపథ్యంలో ఇప్పుడు మద్దతు తప్పనిసరి అని వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఎవరికి మద్దతునిస్తారో వారే అధికార పీఠాన్ని ఎక్కనున్నారు. ఒకవేళ తానే సీఎం కావాలని భావిస్తే ఇక కింగ్ మేకర్ అనే పదానికి ఆయనే సరిపోలుతారు. శనివారం వెలువడే ఫలితాలతో ఈ సందిగ్ధం తొలగనుంది. కేంద్రంలోని బీజేపీ ఏ చిన్న ఛాన్స్ ఉన్నా అధికారాన్ని ఛేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే కుమారస్వామి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు కర్ణాటకలో పాగా వేయడం ద్వారా వచ్చే అన్ని ఎన్నికలకు దీటుగా సిద్ధమవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. మరి ఇప్పుడు మెజార్టీ ఓటరు ఏం నిర్ణయించుకున్నాడో తెలియలాంటే మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే..

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...