34 C
India
Tuesday, May 21, 2024
More

    KTR Natukodi Curry With Gangavva : ఊళ్లోకి వచ్చి గంగవ్వతో నాటుకోడి కూర వండిన కేటీఆర్.. వైరల్

    Date:

    KTR Natukodi Curry With Gangavva
    KTR Natukodi Curry With Gangavva

    KTR Natukodi Curry With Gangavva : బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నాటుకోడి కూర వండారు. ఎప్పుడు బిజీగా ఉండే కేటీఆర్ నాటుకోడి కూర వండటమేమిటని మీకు సందేహం రావచ్చు. కానీ ఇది ముమ్మాటికి నిజమే. స్వయంగా ఆయన చేతుల మీదుగానే కూర వండారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మైవిలేజ్ షో సభ్యులు గంగవ్వ, అంజి, అనిల్, చందుతో కలిసి ఇటీవల హైదరాబాద్ శివారులో నాటుకోడి కూర వండేందుకు సిద్ధం కావడంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వారతో కలిసి కూర వండి భోజనం చేశారు. ఈ సందర్భంగా సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. గంగవ్వతో పోటీపడటం ఎవరి వల్ల కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆమెతో పోటీపడేది ఒక్క మంత్రి మల్లారెడ్డి మాత్రమేనని చమత్కారంగా అన్నారు.
    లంబాడిపల్లెకు పలు తాయిలాలు ప్రకటించారు. లంబాడిపల్లెను రెవెన్యూ గ్రామంగా చేస్తానని హామీ ఇచ్చారు. గంగవ్వ జీవిత కథ తెలుసుకుని ప్రశంసించారు. కొండగట్టు ఆలయ డెవలప్ మెంట్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

    తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంది. మూడు పార్టీలు నువ్వా నేనా అన్న ధోరణిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక సమరమే. సర్వేలన్ని హంగ్ ఏర్పడుతుందని చెబుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...