34.4 C
India
Thursday, May 16, 2024
More

    Leo Movie 6Days Collections : బాక్సాఫీస్ దగ్గర ‘లియో’ అరాచకం.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తున్న విజయ్!

    Date:

    Leo Movie 6Days Collections
    Leo Movie 6Days Collections

    Leo Movie 6Days Collections : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సొంతం చేసుకున్న సినిమా ఏది అంటే అది ”లియో” అనే చెప్పాలి.. ఈ సినిమా రిలీజ్ అయినా ప్రతీ చోట సంచలనాలు నమోదు చేస్తుంది.. లియో సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతూ టాక్ అండ్ రివ్యూ లతో సంబంధం లేకుండా దూసుకు పోతుంది.

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి తెలియని వారు లేరు అనే చెప్పాలి. ఈయన కోలీవుడ్ హీరో అయినప్పటికీ విజయ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది.. మరి ఈయన లేటెస్ట్ గా తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ ”లియో”..

    ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిలీజ్ రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే విజయ్ తన స్టార్ డమ్ తో ఈ సినిమాను టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టేలా చేస్తున్నాడు.

    300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.. ఇక ఈ సినిమా మొదటి రోజే 145 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ నెలకొల్పింది.. 2వ రోజు 65 కోట్లు, 3వ రోజు 75 కోట్లు, 4వ రోజు 70 కోట్లు, 5వ రోజు 46 కోట్లు రాబట్టింది. దీంతో ఐదు రోజుల్లోనే 400 కోట్ల క్లబ్ లో చేరింది.

    ఇక 6 వ రోజు అంటే నిన్న మంగళవారం ఈ సినిమా ఎంత రాబట్టిందంటే ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా 450 కోట్ల మార్క్ చేరుకుంది.. కోలీవుడ్ లో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది. అంతేకాదు కమల్ విక్రమ్ మూవీ రికార్డులను క్రాస్ చేసినట్టు చెబుతున్నారు. ఇలా అన్ని రికార్డులను తిరగరాస్తూ ఈ సినిమా ముందుకు వెళుతూ బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    Leo Review : లోకేశ్ కనగరాజ్ మరో హిట్ కొట్టాడా..? ‘లియో’ రివ్యూ చూద్దాం..

    Leo Review : ‘ఖైదీ’, ‘విక్రమ్’తో ఫేమ్ సంపాదించిన దర్శకుడు లోకేశ్...

    ‘Leo’ : ‘లియో’ చివరి 20 నిమిషాలు అరాచకమే! లీక్ అయినట్లు టాక్!

    'Leo' : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ...