36 C
India
Monday, April 29, 2024
More

    Leo Review : లోకేశ్ కనగరాజ్ మరో హిట్ కొట్టాడా..? ‘లియో’ రివ్యూ చూద్దాం..

    Date:

    Leo review
    Leo review

    Leo Review : ‘ఖైదీ’, ‘విక్రమ్’తో ఫేమ్ సంపాదించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. కమల్ హాసన్ కు వీరాభిమాని అయిన లోకేశ్ విక్రమ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తర్వాతి చిత్రం విజయ్ తో కలిసి ‘లియో’ చేశాడు. వీరి కాంబోలోనే గతంలో ‘మాస్టర్’ వచ్చింది. ఇప్పడు ఈ మూవీని తన సొంత బ్యానర్ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)’ వచ్చిన చిత్రంతో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేక చతికిల పడిందా తెలుసుకుందాం.

    నటీ నటులు..
    విజయ్‌, త్రిష, సంజయ్‌ దత్‌, అర్జున్‌, మిస్కిన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, శాండీ మాస్టర్‌, మాథ్యూ థామస్‌, బాబూ ఆంటోనీ,  జార్జ్‌ మరియన్‌, అభిరామ్‌, మనోబాల, వెంకటాచలం లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు.
    సంగీతం
    అనిరుధ్‌ రవిచందర్‌
    సినిమాటొగ్రఫీ: మనోజ్‌ పరమహంస
    ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌
    బ్యానర్‌: సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో
    ప్రొడ్యూసర్: ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌, జగదీశ్ పళణిస్వామి;
    రచన: లోకేశ్ కనగరాజ్‌, ధీరజ్‌ వైదీ, రత్నకుమార్‌,
    దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్‌

    కథ విషయానికి వస్తే..
    పార్తి అలియాస్ పార్తిబ‌న్ (విజ‌య్‌) హిమాచ‌ల్ ప్రదేశ్ లోని థియోగ్‌ ప్రాంతంలో స్థిర‌ప‌డిన తెలుగువాడు. ఆయన భార్య సత్య (త్రిష)తో కలిసి కేఫ్ నడుపుతూ 20 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. వీరిది లవ్ మ్యారేజ్ కాగా ఒక బాబు, పాప ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ ఒక క్రిమినల్ ముఠా ఎంట్రీతో తలకిందులవుతుంది. కేఫ్ లోకి వచ్చిన క్రిమినల్ ముఠా డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేయగా పార్తిబన్ ఆ ముఠాను కేఫ్ లోకే కాల్చి చంపేస్తాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతారు. అయితే ఆత్మరక్షణ కోసమే వారిని చంపినట్లు ధ్రువీకరించి నిర్ధోషిగా విడుదల చేస్తుంది.

    ఈ వార్తను పత్రికలో చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ పార్తిబన్ ను పట్టుకొని చంపేందుకు హిమాచల్ ప్రదేశ్ కు బయల్దేరుతుంది. ఈ ఘటనతో పాటు 20 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఆంటోని కొడుకు లియోలా పార్తిబన్ గా ఉండడం కూడా కారణం. మరి ‘లియో’ ఎవరు? అతను పార్తిబన్ ఒక్కటేనా? లేక ఇద్దరా? కొడుకునేచంపాలని లియో తండ్రి ఆంటోని ఆయన అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దీని గురించి తెలుసుకోవాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే..

    చిత్రీకరణ
    లోకేశ్ కనగరాజ్ గత సినిమాలు ఖైదీ, విక్రమ్ కథలతో కొంత స్టోరీని లింకప్ చేయాలని అనుకన్నాడు. కానీ ఆ రెండింటిలోకి కొన్ని అంశాలకు అనుసంధానంగా దీనిలో కొన్ని అంశాలను జోడించాడు. ఖైదీ మూవీలో ఉన్న నెపోలియన్ పాత్ర లియోలో ఉంటుంది. ఇక విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లియోతో ఫోన్ లో మాట్లాడడం వంటి సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే ఇవి ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చినా.. ఆ కథలతో ఈ కథకు ఎటువంటి సంబంధం లేదు. సినిమా ప్రారంభంలో ఒక క్రిమినల్ ముఠా కలెక్టర్ ను హత్య చేసి తప్పించుకోవడంతో సినిమా స్ట్రాట్ అవుతుంది. ఆ తర్వాత హైనాతో పార్తిబన్ (విజయ్) తలపడుతూ పరిచయం చేశాడు. ఈ మొత్తం ఎపీసోడ్ ఫస్ట్ ఆఫ్ కు హైలెట్ గా నిలుస్తుంది.

    పర్ఫార్మెన్స్
    పార్తిబ‌న్‌, లియో రెండు పాత్రల్లో విజయ్ క‌నిపించారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చక్కగా చూపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా, స్టయిలిష్ గా విజయ్ గెటప్, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇక లియోగా కూడా ఆయన హీరోయిజాన్ని చూపించారు. ఇద్దరు పిల్లల తల్లిగా త్రిష చక్కగా ఒదిగిపోయింది. కథా పరంగా ఆమెకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఉన్నంత వరకు బాగా నటించి ఆకట్టుకుంది. విజయ్ తో ఆమెకున్న కెమిస్ట్రీ బాగుంది. ఇక ఆంటోని దాస్ పాత్రలో సంజయ్ దత్, హెరాల్డ్ దాస్ పాత్రలో అర్జున్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. గౌత‌మ్ మేన‌న్‌, ప్రియా ఆనంద్, మ‌న్సూర్ అలీ ఖాన్‌ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

    లోకేశ్ లియోతో యాక్షన్ డోస్ ను తగ్గించి ఫ్యామిలీ డోస్ పెంచేందుకు ప్రయత్నం చేశారు. కథను ప్రారంభించిన విధానం, ఫస్ట్ ఆఫ్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక సెకండ్ ఆఫ్ లో కొంత భాగం సాగతీతలా కనిపించింది. సంజయ్ దత్ వ్యవహార శైలి అంతగా ఆకట్టుకోలేకపోయింది. చివరకు విక్రమ్(కమల్ హాసన్) లియోకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపి కథను ముగించారు. ఇది పెద్దగా కిక్ ఇవ్వలేదు. కానిస్టేబుల్ నెపోలియన్ పాత్ర కొంచెం వరకు మెప్పించింది.

    అనిరుధ్ సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో మరింత ఇంటెన్సిటీ తీసుకువచ్చింది. మనోజ్ పరమహంస సినిమాటో గ్రఫీ మూవీకి అట్రాక్షన్. కారు ఛేజింగ్ సీన్స్. దాస్ కంపెనీని లియో కాల్చివేయడం ముందు వచ్చే సీన్స్ వాటి సీక్వెన్స్ షాట్స్ వారెవ్వా అనిపించాయి. ప్రతీ యాక్షన్ సీన్ డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు లోకేశ్.

    ప్లస్ పాయింట్స్
    విజయ్ నటన,
    హైనాతో ఫైట్ సీక్వెన్స్,
    ఫ్లాష్ బ్యాక్ లో ఫైట్ సీన్స్

    మైనస్ పాయింట్స్
    సెకండ్ ఆఫ్ సన్నివేశాలు,
    ఎండ్ చేసిన విధానం

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    Leo Movie 6Days Collections : బాక్సాఫీస్ దగ్గర ‘లియో’ అరాచకం.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తున్న విజయ్!

    Leo Movie 6Days Collections : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్...