29.5 C
India
Sunday, May 19, 2024
More

    Mark Antony Review : విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    Mark Antony Movie Review & Rating
    Mark Antony Movie Review & Rating

    Mark Antony Review :

    కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు.. ఈయన తెలుగు వారే అయినప్పటికీ కోలీవుడ్ లో ఎప్పుడో సెటిల్ అవ్వడంతో విశాల్ కూడా అక్కడే హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నాడు.. ఈయనకు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉంది.. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు..
    ఇదిలా ఉండగా విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ”మార్క్ ఆంటోనీ” గా ఈయన తమిళ్, తెలుగు భాషల్లో ఆడియెన్స్ ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. మరి ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ కాగా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
    నటీనటులు :
    విశాల్
    ఎస్ జె సూర్య
    సునీల్
    కే సెల్వరాఘవన్
    రెడిన్ కింగ్ స్లే
    అభినయ
    రీతూ వర్మ తదితరులు..
    డైరెక్టర్ : అధిక్ రామచంద్ర
    రచన : ఎస్జె అర్జున్, సావిత్రి ముత్తు, అధిక్ రవిచంద్రన్
    నిర్మాత వినోద్ కుమార్
    మ్యూజిక్ : జివి ప్రకాష్ కుమార్
    సినిమాటోగ్రాఫర్ : అభినందన్ రామానుజం
    కథ :
    హైదరాబాద్ నగరంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు ఆంటోని (విషాక్) జాకీ మార్తాండ (ఎస్జే సూర్య) ఉన్నారు.. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు.. వ్యాపారంలో తమకు శత్రువైన మరో గ్యాంగ్ స్టర్ ఏకాంబరం (సునీల్) ముఠాతో వీరి వైరం సాగుతుంది.. ఆంటోనీని ఏకాంబరం చంపేసి పారిపోతాడు.. ఇక ఆయన భార్య (అభినయ) కూడా మరణించంతో వారి కుమారుడు మార్క్ (విశాల్) వారి తల్లిదండ్రుల చావుకు కారణం అయిన ఏకాంబరంను చంపేయడానికి స్కెచ్ వేస్తాడు.. మరి వీరి మధ్య సాగే యాక్షన్ డ్రామానే మిగిలిన కథ..
    విశ్లేషణ :
    మాఫియా ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ‘మార్క్ ఆంటోనీ’ భారీ స్థాయిలో తెరకెక్కింది.. మాఫియాకు టైం మిషన్ జోడించి డైరెక్టర్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో చేసిన మ్యాజిక్ బాగానే పండింది.. టైం మిషన్ తో గతంలోకి వెళ్లి చేసిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలోనే ఆద్యంతం కామెడీ పండింది.. డైరెక్టర్ ఆంటోనీ, జాకీ మార్తాండ, మదన్, మార్క్ పాత్రలను తేరా మీద చూపించిన తీరు ఆకట్టుకున్నాయి.. ఎక్కడ లాగ్ లేకుండా ఫాస్ట్ గా సినిమాను పరిగెత్తించాడు..
    నటీనటుల పర్ఫార్మెన్స్ :
    విశాల్, ఎస్జె సూర్య ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు.. విశాల్ మార్క్, ఆంటోనీగా తన నటనలోకి కొత్త కోణాన్ని బయటకు తీస్తే.. ఎస్ జె సూర్య జాకీ, మదన్ గా విశ్వరూపం చూపించారు. ఇక ఈ సినిమాలో ఏకాంబరంగా సునీల్, చిరంజీవిగా సునీల్, చిరంజీవిగా సెల్వ రాఘవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. ఇక అభినయ, రీతూ వర్మ తమ పాత్రలకు న్యాయం చేసారు..
    టెక్నీకల్ పర్ఫార్మెన్స్ :
    టెక్నీకల్ గా చూసుకుంటే.. 1975 నుండి 95 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాకు హగినట్టుగా కాస్ట్యూమ్స్, మేకప్స్ తో కొత్త వరల్డ్ ను సృష్టించారు.. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి.. ఆర్ట్ విభాగం కూడా బాగా పనిచేసింది. తొలి ఫ్రేమ్ నుండే కొత్త లోకంలోకి ఆడియెన్స్ ను తీసుకు వెళ్లి బాగా కనెక్ట్ అయ్యేలా చేసారు. డైరెక్టర్ కథ, స్క్రీన్ ప్లేను బాగా చూపించి ఆకట్టుకున్నారు.
    చివరిగా.. రెగ్యురల్, రొటీన్ స్టోరీ అయినప్పటికీ టెక్నీకల్, స్క్రిప్ట్ పరంగా మంచి డెప్త్ ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది అనే చెప్పాలి.. టైం ట్రావెల్, టైం మిషన్, స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ అధిక్ పెర్ఫెక్ట్ గా యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను పరిచయం చేసాడు..
    రేటింగ్ : 2.5/5

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    విశాల్ మార్క్ ఆంటోనీ షూటింగ్ లో ఘోర ప్రమాదం

    తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్క్...