Hyderabad News : రాను రాను యూత్ చాలా సెన్సిటివ్ గా తయారవుతుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. బతికి సాధించాలి కానీ.. సూసైడ్ చేసుకుంటే ఎవరికి ప్రయోజనం ఉంటుంది. అని అవగాహన కల్పిస్తున్నా.. సూసైడ్ లు మాత్రం ఆగడం లేదు. ఈ సంప్రదాయం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రెషరా..? లేక ఫ్యామిలీ గొడవాలా? తెలియదు గానీ.. వీరిలో సూసైడ్లు పెరిగిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ సూసైడ్లు నగరం (హైదరాబాద్)లో మరింత ఎక్కువగా నమోదవడం కాస్తంత కలవరపాటుకు గురి చేస్తుంది.
ఇటీవల ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ సూసైడ్ చేసుకుంది. ఇది నగరంలో ఉలిక్కిపాటుకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరం(హైదరాబాద్)లోని గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్ లో విద్య(23) అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఈ వార్త తెలియడంతోనే ఆ పరిసరాలన్నీ ఆందోళనకరంగా మారాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, గోస్కులపల్లె గ్రామానికి చెందిన ముదం విద్య గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా విధులు నిర్వర్తి్స్తుంది. సమీపంలోని కొత్తగూడలోని హాస్టల్ లో ఉంటోంది. మార్చి 17వ తేదీ యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో హాస్టల్ గదిలోని బాత్ రూంలో షవర్ రాడ్‌కు సోమవారం ఉరేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు హాస్టల్ చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా తమ కూతురు విగతజీవిగా మారడం చూసిన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.