
AP government : టికెట్ల ధరల పెంపునకు సీఎం జగన్ కు అభ్యర్థన
చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోయే భోళా శంకర్ మూవీ పై టాలీవుడ్ లో ఇప్పటికే బజ్ ను క్రియేట్ చేసింది. అయితే ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా భోళాశంకర్ విడుదల సందర్భంగా ఈ సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తున్నది. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా, నిరాకరిస్తుందా అనేది అనుమానాలు తలెత్తున్నాయి.
చిరంజీవి భోళా శంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు మెగా అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. సినిమా బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని టికెట్ రేట్లు పెంచేందుకు చిత్రబృందం అనుమతి కోరినట్లు సమాచారం.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్‌లలో సినిమా టిక్కెట్ల ధరను రూ.25 వరకు పెంచాలని భోళా శంకర్ టీమ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తున్నది. అయితే, తెలంగాణాలో, ఇక్కడ టిక్కెట్ల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో మేకర్స్ సాధారణ ధరలతోనే వెళ్తున్నారు. భోళా శంకర్ టికెట్ ధర పెంపుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
గత కొన్నాళ్లుగా జగన్‌పైనా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో, భోళా శంకర్ టీమ్ అభ్యర్థనపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పడు మరింత ఆసక్తిగా మారింది.
భోలా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం మూవీకి రీమేక్. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తమన్నా కథానాయికగా నటించింది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర భోళా శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.