Miss Shetty success Meet : మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై 15 రోజుల్లోనే లక్షల్లో వసూళ్లును సాధించింది. ప్రీ రిలీజ్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. దీంతో సినిమా నిర్మాణ బ్యానర్ యూవీ క్రియేషన్స్ సక్సెస్ మీట్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి అమెరికాలో సక్సెస్ టూర్ కు ప్లాన్ ఖరారైంది.
ఈ నెల (సెప్టెంబర్) 25వ తేదీ సోమవారం రోజున అమెరికాలో ‘ఎల్ఏ సక్సెస్ టూర్ అండ్ థ్యాంక్యూ మీట్’ నిర్వహిస్తున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి పాల్గొననున్నారు. సినిమార్క్ సెంచరీ ఆరంజ్ అండ్ ఎక్స్ డీలో ఈ ప్రోగ్రాం ఉంటుందని చెప్తున్నారు. ఈ మీట్ అండ్ గ్రీట్ ను న్యూఇయర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ గా తీసుకురావాలని నిర్వాహకులను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
టికెట్ల కోసం సినిమా థియేటర్ కు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ సినిమాను అమెరికాలో ‘ప్రత్యంగిర సినిమాస్’ ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతోంది. దీంతో సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపేందుకు సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఇక, ఈ మూవీలో పోలిశెట్టి నవీన్, అనుష్క శెట్టి నటించగా.. నిర్మాతలుగా వంశీ-ప్రమోద్ వ్యవహరించగా, రచన, దర్శకత్వం పీ మహేశ్ బాబు వహించారు. ఓవర్సీస్ లో కూడా భారీగా స్పందన వచ్చింది.