
Custody Movie Review : అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కస్టడీ”.. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ముందు నుండి భారీగానే క్రియేట్ అయ్యాయి.. వెంకట్ ప్రభు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు.. తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.. దీంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తూ హైప్ పెంచారు.. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా కథ ఎలా ఉందో ? దీనికి ఎంత రేటింగ్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
కథ విషయానికి వస్తే..
నాగ చైతన్య శివ పాత్రలో నీతిగల పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవాడు.. ఈయన ప్రేమించిన కృతి శెట్టి (రేవతి)ని ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటే.. రాజన్న (అరవింద్ స్వామి)ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈయనను ఎవరో చంపేస్తున్నారు అని తెలుసుకుని ఆయనను కాపాడడం కోసం శివ పోరాటం చేస్తుంటాడు.. దీని చుట్టూనే కథ మొత్తం తిరుగుగుతుంది..
ఇక ఈ సినిమాలో అందరు తమ పాత్రలకు న్యాయం చేసారు అనే చెప్పాలి.. డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు అనుగుణంగా బాగా ప్రజెంట్ చేసాడు.. అయితే కొద్దిగా తమిళ్ వాసన మాత్రం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది.. అలాగే పాటల మీద పెట్టిన ద్రుష్టి కథ మీద మరికొద్దిగా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది..
ప్లస్ పాయింట్స్ :
యాక్షన్ ఎపిసోడ్స్, నాగ చైతన్య నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో సాగదీత, స్క్రీన్ ప్లే.
సెకండాఫ్ లో సాగదీత, స్క్రీన్ ప్లే.
చివరిగా.. మళ్ళీ కొద్దిగా నిరాశ తప్పదు.. కథ కథనాలు కొత్తగానే ఉన్న వాటిని డైరక్టర్ ప్రజెంట్ చేసిన తీరు బాలేదు.. అందుకే మాస్ హీరోగా మెప్పించాలి అనుకున్న నాగ చైతన్యకు నిరాశ ఎదురైంది.. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది.. మరి కలెక్షన్స్ ప్రకారం కమర్షియల్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి..