Naga Chaitanya Comments :
అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరు పెళ్లి అయ్యాక ఎంతో అన్యోన్యంగా జీవించారు.. టాలీవుడ్ లోనే మోస్ట్ లవింగ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి.
నాలుగేళ్లకే మనస్పర్థల కారణంగా విడిపోయారు.. ఇప్పటికి వీరు మళ్ళీ కలిస్తే బాగుండు అని అనుకోని ఫ్యాన్స్ లేరు.. ఇక వీరి పెళ్లి ముగిసిన తర్వాత ఇద్దరు ఎవరికీ వారు కెరీర్ లో బిజీ అయ్యారు.. సమంత ఇప్పుడు ఖుషి సినిమాతో వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే నాగ చైతన్య నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండతో సమంత వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్య పరచడమే కాకుండా ట్రోల్స్ కు గురి చేసింది. వీరు చేసిన లైవ్ పర్ఫార్మెన్స్ పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. వీడ్కలు తీసుకున్న కూడా నాగ చైతన్య ఫ్యాన్స్ నుండి సమంతపై ట్రోల్స్ రావడం హాట్ టాపిక్ అయ్యింది..
విడాకుల గురించి కస్టడీ ప్రొమోషన్స్ లో నాగ చైతన్య ఓపెన్ అయ్యారు.. ఈయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.. ”మేము విడిపోయి రెండేళ్లు అయ్యింది.. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తి అయ్యింది.. విడాకుల తర్వాత మా జీవితాలు వేరుగా కొనసాగుతున్నాయి.. మీడియా ఊహాగానాల కారణంగానే మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.
ముందుగా నేను ఊహాగానాలను పట్టించుకోక పోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి మా పెళ్లి గురించి ప్రజలు చర్చించు కుంటూ ఏదేదో ఉహించు కుంటున్నారు.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ప్రతీ అంశం జీవితంలో నేర్చుకోదగినదే.. ఏది ఏమైనా నా మంచికే అనుకుంటాను అంటూ ఈయన చెప్పుకొచ్చారు.. సోషల్ మీడియా ప్రచారంలో మూడవ వ్యక్తి మాట్లాడడం వల్లనే గొడవలు అయ్యి విడిపోవాల్సి వచ్చింది అని ఈయన చెప్పుకొచ్చారు.