Narendra Modi Wife : మనకు రాజకీయ నాయకుల జీవితాల గురించి తెలుసుకోవడం ఉత్కంఠగా అనుకుంటాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వ్యక్తిగత జీవితం ఉంది. పెళ్లయింది. కానీ భార్యతో ఉండటం లేదు. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో బయట పెట్టారు. తన భార్య పేరు జశోదాబెన్ అనే విషయం బయటకు వచ్చింది. దీంతో అప్పటి దాకా నరేంద్ర మోడీకి భార్య ఉన్నదనే విషయమే చాలా మందికి తెలియదు.
నరేంద్ర మోడీ పూర్తిపేరు నరేంద్ర దామోదర దాస్ మోడీ. గుజరాత్ లోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. తన చిన్నతనంలో తండ్రికి ఉన్న టీ కొట్టులో చాయ్ లు అమ్మేవారు. 8 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఏర్పడింది. దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించారు. తండ్రితో కలిసి టీ అమ్మకంలో సాయపడేవాడు.
మోడీకి 18 ఏళ్ల వయసులో జశోదాబెన్ ను ఇచ్చి వివాహం చేశారు. కానీ వారి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మోడీ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. కొన్నాళ్లకు తిరిగి వచ్చాక తల్లిదండ్రులు భార్యను తీసుకొచ్చినా ఆమెతో కలిసి ఉండలేదు. తన ఆశయాలు వేరని మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అలా ఆయన వైవాహిక జీవితానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.
జశోదాబెన్ విశ్రాంత ఉపాధ్యాయురాలు. కానీ ఆమెతో గడిపింది తక్కువే. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పెళ్లి విషయం ప్రస్తావన రావడంతో భార్య విషయం బయటకు వచ్చింది. అంతవరకు ఎవరికి కూడా తెలియదు. 2014 ఎన్నికల సమయంలో మోడీ భార్య పేరు రాయాల్సి వచ్చింది. దీంతో ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలియడం గమనార్హం.