29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Pawan Kalyan-Anna Lezhinova : పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా విడిపోనున్నారా.? పిల్లలతో రష్యాలో ఉంటున్న అన్నా..

    Date:

    Pawan Kalyan-Anna Lezhinova : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్నా లెజినోవా విడిపోతున్నట్లు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అన్నాకు, పవన్ కళ్యాణ్ కు వివాహం జరిగి పదేళ్లు అవుతోంది. ప్రస్తుతం అన్నా లెజినోవా పిల్లలతో రష్యాలో ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై పవన్, అన్నా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

    వారు విడిపోయినట్లు పలు వెబ్ పోర్టర్లలో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా చట్టబద్ధంగా కాకపోయినా సామాజికంగా విడిపోయారని ఒక వెబ్ సైట్ ప్రచురించింది. ఇటీవల మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లకు అన్నా గైర్హాజరు కావడంతో విడిపోయారనే పుకార్లు వ్యాపించాయి.

    పవన్ తో తరచూ కనిపించే అన్నా గత నెలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో కనిపించలేదు. ‘వారాహి యాత్ర’ ప్రారంభానికి ముందు పవన్ కళ్యాణ్ చేపట్టిన యాగానికి కూడా ఆమె హాజరు కాలేదు. వీడియో కాల్స్ ద్వారా ఆమెతో, వారి పిల్లలతో పవన్ టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

    అన్నా లెజినోవా ఎవరు?
    2011లో ‘తీన్‌మార్’ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ అన్నాను కలిశారు. ఆ సమయంలో అన్నా రష్యన్ మోడల్, నటి. వీరు ప్రేమించుకొని 30 సెప్టెంబర్, 2013న వివాహం చేసుకున్నారు. అన్నాకు మొదటి వివాహం ద్వారా ఇప్పటికే పోలెనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉండగా, అన్నా లెజినోవాతో పవన్ 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొడుకును కన్నాడు.

    పవన్ కళ్యాణ్ మొదటి, రెండో భార్యలు ఎవరు?
    పవన్ గతంలో నందిని, రేణు దేశాయ్ లను వివాహం చేసుకున్నారు. అతని మొదటి వివాహం పెద్దలు కుదిర్చినది కాగా, 1997లో జరిగింది. 2008లో నందిని నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది ఇలా ఉంటే 2001లో రేణు దేశాయ్ తో డేటింట్ ప్రారంభించగా 2004లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2009లో పెళ్లి చేసుకున్న పవన్-రేణు దంపతులకు ఓ కూతురు పుట్టింది. అయితే 2011లో వీరు కూడా విడిపోయారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related