19.6 C
India
Thursday, November 13, 2025
More

    PM Modi Range America : వామ్మో.. అమెరికాలో మోదీ రేంజ్ మాములుగా లేదుగా..

    Date:

    PM Modi Range America
    PM Modi Range America

    PM Modi Range America : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ముందుగా న్యూయార్క్ లో పర్యటించారు. ఆ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన పర్యటనకు ఇండియన్లే కాదు అమెరికన్లు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఆయన విశ్వగురువు అయ్యారు అంటూ బీజేపీ శ్రేణులు కొనియాడుతున్నాయి. మరోవైపు మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడితో ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఇండియా, అమెరికా రక్షణ సంబంధిత విషయాలపై వారు ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. ఆర్థిక అంశాలతో పాటు  విదేశాంగ విధానం, భద్రతా పరమైన చర్యలు, ఉగ్రవాదం తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది.

    అమెరికాలో పోప్ పర్యటన కంటే మోదీ పర్యటనకు క్రేజీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడి మీడియా చెబుతున్నది. అక్కడి సభలకు హాజరైన వారిని చూస్తేనే అర్థమవుతున్నది. వైట్ హౌస్ లో మోదీకి అక్కడి అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కోసం స్పెషల్ విందు ఇచ్చారు. ప్రత్యేక బహుమానాలు ఇచ్చారు. అయితే కొందరు మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తున్నా, అక్కడ మాత్రం ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంది. వేలాది మంది మోదీ రాకకోసం వేచి ఉండడం, ఆయనకు ఉన్న క్రేజీని తెలుపుతున్నది.

    అమెరికా పర్యటనలో ఉన్న మోదీని ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా కలిశారు. అందులో తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు కూడా ఉన్నారు.  ఇండియా ఘనతను తెలియజేస్తూ మోదీ పర్యటన ఆద్యంతం కొనసాగుతున్నది. భారతమాతాకీ జై.. జైజై మోదీ అంటూ మోదీ సభల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. అయితే వాషింగ్టన్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారతీయులు చేరుకున్నారు. వారంతా మోదీని కలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. గతంలో ఏ ప్రధానికి దక్కని గౌరవం మోదీకి దక్కుతున్నదని అమెరికన్ మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. భారత్, అమెరికా సంబంధాల బలోపేతం కోసమే ఆయన అక్కడ పర్యటిస్తున్నారని అమెరికాలో భారత  విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    skater Tara Prasad : భారతీయ-అమెరికన్ స్కేటర్ తారా ప్రసాద్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా

    Skater Tara Prasad : మహీంద్రా కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త...

    Bitcoin : ట్రంప్ సంచలనం.. ఇక ‘బిట్ కాయిన్’ రిజర్వ్ లు

    Bitcoin : ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి ఒక కార్యనిర్వాహక ఆర్డర్...