36.9 C
India
Sunday, May 19, 2024
More

    Poor People Straight Question : పేదలకు ఏం చేశారని మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి జగన్ గారు? సామాన్యుల సూటి ప్రశ్న

    Date:

    Poor people straight Question
    Poor people straight Question to CM Jagan

    Poor people straight Question to CM Jagan : ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో రాష్ర్టం ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రాష్ర్టంలో అభివద్ధి మాట అటుంచితే పూర్తిగా విధ్వంసమే జరిగిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తున్నది. ఏపీ సీఎం జగన్ ఇటీవల తరచూ పేదలకు, పెత్తందార్లకు మధ్య పోటీ అంటూ సంబోధిస్తున్నారు. అసలు పేదలను ఓన్ చేసుకునేందుకు జగన్ కు ఉన్న హక్కేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ర్ట ప్రయోజనాలను పక్కన పెట్టినందుకు, ప్రజలను దోచుకున్నందుకు, రాజధాని ఏంటో తెలియకుండా చేసినందుకు పేదలంతా జగన్ వైపు ఉండాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

    నిజానికి ఏపీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే అభిప్రాయం ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. వైసీపీ కక్ష పూరిత రాజకీయాలే ఇందుకు కారణమనే టాక్ ఉంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని కూడా సీఎం జగన్ ఓర్వలేకపోయారని , ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధిస్తున్నారు.  పేదలు జగన్ ను ఎందుకు ఓన్ చేసుకోవాలో చెప్పాలని ఇందులో అడుగుతున్నారు.  ఆదానీని రహస్యంగా కలిసినప్పుడే ఇక్కడ పెత్తందారులు ఎవరో అర్థమవుతున్నదని, ఆయనకు పోర్టులను కట్టబెట్టినప్పుడే కార్పొరేట్ కు ఊడిగం చేసేవారెవరో తెలిసిపోతున్నదని మండిపడుతున్నారు.

    1). పేదవారికి ₹5కే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేసినందుకు ఓన్ చేసుకుంటారా?  (2). విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తానని చెప్పి, నాలుగేళ్లలో 8సార్లు పెంచినందుకు ఓన్ చేసుకుంటారా?  (3). పేదవాళ్లు ప్రయాణం చేసే ఆర్టీసీ చార్జీలు నాలుగేళ్లలో నాలుగు సార్లు పెంచినందుకు ఓన్ చేసుకుంటారా?  (4). చెత్తకి పన్ను వేసినందుకు ఓన్ చేసుకుంటారా?  (5). పెట్రోల్, డీజిల్ రేట్లు దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నందుకు ఓన్ చేసుకుంటారా? (6).ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను 15% పెంచినందుకు ఓన్ చేసుకుంటారా?  (7). నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశానికి అంటే విధంగా ఉన్నందుకు ఓన్ చేసుకుంటారా?  (8). కొత్త రహదారులు నిర్మించకపోయినా, ఉన్న రోడ్లపై గుంతలు పూడ్చటం చేతకానందుకు ఓన్ చేసుకుంటారా?(9) ఆగిపోయిన పోలవరం సాక్షిగా ఓన్ చేసుకోవాలా..?

    (10)రాజధాని ఏంటో తెలియకుండా చేసినందుకు ఓన్ చేసుకోవాలా..?(11) నాలుగేళ్లలో అసలు ప్రజలను కలవనందుకు ఓన్ చేసుకోవాలా..?(12) ప్రత్యేక హోదా సాధించనందుకు.. (13) విశాఖ ఉక్కును కాపాడనందుకు.. (14)ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టినందుకు.. (15) కృష్ణ జలాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు..(16) కక్ష సాధింపులే పాలనగా పెట్టుకున్నందుకు.. (17) ప్రజాప్రతినిధులమనే బాధ్యత మరిచి పేట్రేగి పోతున్న నేతలకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు ఓన్ చేసకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుక్కుంటూ పోతే వంద ప్రశ్నలు మీ మీద వస్తున్నాయని, ఎందుకు మిమ్మిల్ని ఓన్ చేసుకోవాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...