40.2 C
India
Sunday, May 19, 2024
More

    రాహుల్ గాంధీకి దక్కని ఊరట

    Date:

    Rahul gandhi disqualified as parlament member
    Rahul gandhi

    రాహుల్  గాంధీపై అనర్హత వేటు విషయం ఇప్పట్లో తేలేలా లేదు. హైకోర్టులో ఊరట లభిస్తుంది అని భావించిన కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలింది.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మాత్రం మంజూరు చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్‌పై వేసవి సెలవుల తర్వాత జూన్ 4న తుది తీర్పును వెలువరిస్తామని కోర్టు తెలిపింది. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

    రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేసును జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి అప్పగించారు.

    ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది. అయితే రాహుల్ కు శిక్ష పడి తర్వాత లోక్ సభ సెక్రెటెరియట్ ఆయన అనర్హత వేటు వేసింది.

    రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్‌ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే సమస్య మరింత జఠిలమవుతుందని కోర్టుకు తెలిపింది. ఒక వేళ ఆ ఎన్నికల్లో వేరే అభ్యర్థి విజయం సాధించి.. తన శిక్షను రద్దు చేయాలన్న రాహుల్‌గాంధీ పిటిషన్‌ నెగ్గితే.. ఆయనకు తిరిగి ఎంపీ బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉండదని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...