Rahul Sipligunj Comments On Rathika :
ఈసారి ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ సీజన్ లో రతికా రోజ్ అందరి దృష్టిని ఆకర్షించి హైలెట్ అయ్యింది. ముందు నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను పెంచుకున్న ఈ భామ రోజులు గడిచే కొద్దీ మాత్రం చిరాకు కలిగించేలా చేస్తుంది.
ముందుగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను ట్రాప్ లోకి లాగి ఒక వారం పాటు అతడి ఫీలింగ్స్ తో ఆడుకున్న ఈ భామ ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసింది. ఇక ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో మరో ట్రాక్ నడిపిస్తుంది. ఇక ఈమె తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి హైలెట్ అయ్యింది. అతడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అనే వార్తలు వచ్చాయి.. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగానే వీరే లవర్స్ అని అంతా ఫిక్స్ అయ్యారు.
ఇకమొన్న మళ్ళీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకు వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టాడు.. ‘ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు? అందరు తమ సొంత టాలెంట్ ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటే.. కొంత మంది మాత్రం ఇతరుల టాలెంట్, పేరు మీద ఆధార పడుతుంటారు.. ఫేమ్ కోసం అవసరానికంటే ఎక్కువగానే వాడుకుంటారు.. నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్.. పైసలు తీసుకున్న టీమ్ కు కంగ్రాట్స్ అంటూ ఈయన పేరు ప్రస్తావించకుండా పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ రతికా గురించే ఇతడు ఇండైరెక్ట్ గా పెట్టాడు అంటూ టాక్ వినిపిస్తుంది.