37.8 C
India
Monday, April 29, 2024
More

    Bigg Boss 7 : బిగ్ బాస్ చాణక్యకు బిగ్ షాక్.. చివరకు ఇలా తోసేశారేంటండీ బాబూ!

    Date:

    Bigg Boss 7
    Bigg Boss 7

    Bigg Boss 7 : బిగ్ బాస్ ‘‘చాణక్య’’, బిగ్ బాస్ ‘‘మాస్టర్ మైండ్’’ అంటూ ఆ షో ఆర్గనైజర్స్ హైప్ ఇచ్చి శివాజీని చివరకు మూడో స్థానానికి పరిమితం చేశారు. సీజన్ మొదటి నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్- యావర్ లతో పనులు చేయించుకోవడం తప్పితే ఆయన చేసినా  ఎంటర్ టైన్ మెంట్ ఏం లేదు. నాగార్జున.. శివాజీకి ఏవేవో బిరుదులిచ్చి ఎవరెస్ట్ ఎక్కించారు. చివర్లో దాన్నుంచి ఒక్కసారిగా తోసేశారు.

    నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీకి ఎంతోకొంత పేరుంది. అప్పట్లో, హీరోగా, సైడ్ హీరోగా చేశాడు. ఇక ఆ తర్వాత ట్రెండ్ కు తగ్గట్టు మార్చుకోక..నటనకు స్వస్తి చెప్పాడు. ఇక ఆ తర్వాత కొద్దిరోజుల పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడా చానల్స్ లో ఏవేవో డిబేట్లలో పాల్గొనేవాడు. కొద్ది రోజుల తర్వాత అక్కడా కనిపించకుండా పోయారు. ఇక మళ్లీ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా మొండిచెయ్యే మిగిలింది. మూడో స్థానంలో నిలిచాడు.

    శివాజీ బిగ్ బాస్ హౌస్ 3నుంచి 4వారాలు ఉంటే మహా ఎక్కువ అని అందరూ అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏమాత్రం పని చేయకపోయినా టాప్-3లోకి రావడం శివాజీకే దక్కింది. అది కూడా ఓ మైండ్ గేమే అనుకోవచ్చు. నాగార్జున ఫుల్ సపోర్ట్.. అలాగే ప్రశాంత్, యావర్ లతో సపోర్ట్ .. చివరి దాక లాక్కొచ్చాడు.  ఇక బిగ్ బాస్ లో శివాజీపై అందరికీ ఏవగింపు కలిగింది మాత్రం అతడి నోటి దురుసుతనంతోనే. అమ్మాయిలను కూడా ‘‘ఒక్కటి పీకుతా’’, ‘‘పీక మీద కాలు వేసి తొక్కుతా..’’ అని, వారు ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ప్రవర్తించేవాడు. ఇక అమర్ ను అయితే పిచ్చోడా..పనికిమాలినోడా.. అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు.  అమర్ లైట్ గా తీసుకున్నాడు కాబట్టి చెల్లింది. అదే అర్జున్ లేదా గౌతమ్ లను అంటే వారు శివాజీని వేసుకునేవారే కదా..

    తన నోటి నుంచి బూతులు వచ్చినప్పుడల్లా.. ‘‘బాబు గారూ మాది పల్నాడు అండి.. మాకు తెలియకుండానే అలా వస్తున్నాయండి.. వచ్చే వారం అలా జరుగనివ్వనండి’’ అంటూ నాగార్జున దగ్గర వినయం ప్రకటించేవాడు. ఇక తన చేతికి గాయమైందన్న కారణంతో నాలుగైదు వారాలు ఏ టాస్క్ ఆడలేదు. నాగార్జున సపోర్ట్ తో ఏదో మమ అనిపించాడు. ఇక షో చివరకు వచ్చిందనగా.. ఓ సారి నాగార్జునతో ఓ విషయంలో వితండ వాదానికి దిగాడు. ఇలా ఎన్నెన్నో కారణాలతో శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక శివాజీకి మిగిలింది ఏంటంటే..షోలో పార్టిసిపేట్ చేసిన ఆనందం.. వారిచ్చిన రెమ్యూనరేషన్ మాత్రమే.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...